చౌకైన 5G ఫోన్ Mi 9Pro 5G యొక్క అన్ని యూనిట్లు కేవలం 2 నిముషాల్లో అమ్ముడయ్యాయి

చౌకైన 5G ఫోన్ Mi 9Pro 5G యొక్క అన్ని యూనిట్లు కేవలం 2 నిముషాల్లో అమ్ముడయ్యాయి

సెప్టెంబర్ 13 న చైనాలో జరిగిన ఒక కార్యక్రమంలో షావోమి మి 9 ప్రో 5G మరియు షావోమి మి మిక్స్ ఆల్ఫా ఫోన్లను ఆవిష్కరించింది. జింగ్‌డాంగ్ మాల్‌లో ఈ మి 9 ప్రో 5 జి యొక్క మొదటి సేల్ నుండి ఈ హ్యాండ్‌సెట్ యొక్క మొత్తం యూనిట్లు కేవలం రెండు నిమిషాల్లోనే అమ్ముడైంది. అంటే, ఈ  మి 9 ప్రో 5G యొక్క మొదటి సెల్ చూస్తుంటే, ఈ స్మార్ట్ ఫోన్ అంత బాగా నచ్చిందని ఉహించవచ్చు. చైనాలో, ఈ స్మార్ట్ఫోన్ ధర 3,699 యువాన్ (~ 18 518) నుండి మొదలవుతుంది మరియు ఈ ఫోన్ చైనాలో అత్యంత చౌకైన 5 జి స్మార్ట్ ఫోనుగా నిలుస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

షావోమి మి 9 ప్రో 5G ధర

మి 9 ప్రో 5 జి మొబైల్ ఫోన్ను8 జిబి ర్యామ్ మరియు 128 జిబి మోడళ్లలో CNY  3,699 ధరతో లాంచ్ చేశారు, అంటే సుమారు రూ .37,000, ఇది కాకుండా 8 జిబి + 256 జిబి, 12 జిబి + 256 జిబి, 12 జిబి + 512 జిబి మోడళ్లలో కూడా ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయబడింది. ఇది వరుసగా,  సుమారు CNY 3,799 కు, అంటే సుమారు 38,000 రూపాయలు, CNY 4,099 అనగా 41,100 రూపాయలు మరియు CNY 4,299 అంటే సుమారు 43,100 రూపాయలకు ప్రారంభించబడింది. ఈ మొబైల్ ఫోన్‌లో, మీరు ఒక 30W వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నలజిని కూడా మద్దతు పొందుతారు. అలాగే, దీనితో మీరు CNY 199 కోసం అంటే 2000 రూపాయలకు లభించే క్వి స్టాండర్డ్ సపోర్ట్‌ను కూడా పొందవచ్చు.

షావోమి మి 9 ప్రో 5G :స్పెసిఫికేషన్లు

ఈ షావోమి మి 9 ప్రో 5G డ్యూయల్ సిమ్ సపోర్టింగ్ మొబైల్ ఫోన్, ఇది కంపెనీ యొక్క MIUI 11 తో ప్రవేశపెట్టబడింది. ఈ మొబైల్ ఫోన్‌లో మీరు ఒక 6.39-అంగుళాల FHD +  AMOLED డిస్ప్లే ను ఒక వాటర్‌డ్రాప్ నోచ్ తో అందుకుంటారు . ఈ ఫోన్‌, ఒక ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 855+ చిప్‌ సెట్‌ తో వస్తుంది మరియు   12GB వరకు ర్యామ్ సపోర్ట్ ఉంటుంది. ఈ మొబైల్ ఫోన్‌లో మీరు కూలింగ్ గదిని కూడా పొందుతారు, ఇది ఫోన్ యొక్క CPU ని చల్లగా ఉంచడానికి పనిచేస్తుంది.

ఈ ఫోన్‌లో 4000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని, ఒక 40W ఫాస్ట్ ఛార్జింగ్, అలాగే ఫోన్‌లో 30W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఈ ఫోన్ కెమేరా విభాగంలో, 48 MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఇవ్వబడింది. దీనికి జతగా,  ఒక 12 MP  టెలిఫోటో లెన్స్‌ మరియు మరొక 16MP వైడ్ యాంగిల్ లెన్స్‌ను చేరుస్తుంది. ఈ మొబైల్ ఫోన్‌లో ఒక 20 MP  సెల్ఫీ కెమెరా ముందుభాగంలో వస్తుంది.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile