ఇకనుండి Xiaomi మి 4i ఒపెప్ సేల్స్

ఇకనుండి Xiaomi మి 4i ఒపెప్ సేల్స్
HIGHLIGHTS

ఫ్లిప్ కార్ట్, అమెజాన్ తో పాటు మరి కొన్నిటిలో సేల్ అవుతుంది.

Xiaomi మి 4i ఇప్పటివరకూ ఫ్లాష్ సేల్స్ లో అమ్మకాలు చేసింది. అయితే ఇప్పుడు ఫ్లాష్ సేల్స్ లేకుండా ఓపెన్ గా మరిన్ని వెబ్ సైట్లలో అమ్మకాలు జరుపుతుంది ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్.

Mi ఇండియా mi.com అఫీషియల్ సైటులో దొరుకుతున్నట్లు అనౌన్స్ చేసింది. దీనితో పాటు ఫ్లిప్ కార్ట్, అమెజాన్, స్నాప్ డీల్, The mobile store మరియు Airtel సైట్లలో ఇది దొరుకుతుంది. Xiaomi Mi 4i బడ్జెట్ సెగ్మెంట్ లో దొరికే మంచి స్మార్ట్ ఫోన్. చాలా మినిమల్ డిజైనింగ్ తో సింగిల్ హ్యాండ్ యూసేజ్ కు కూడా అనువుగా ఉంటూనే 5in స్క్రీన్ ను అందిస్తుంది మి 4i మోడల్. ఆకర్షణీయమైన లుక్స్ తో ఆండ్రాయిడ్ స్మార్ట్ os ప్రపంచంలోనే అతి క్రేజీ మరియు బెస్ట్ MIUI లేటెస్ట్ OS తో అందుబాటులోని ధరకు కంపెని ఈ సంవత్సరం ఏప్రిల్ లో ఇండియాలో ఎక్స్లూజివ్ గా లాంచ్ చేసింది. 15 వేల బడ్జెట్ సెగ్మెంట్ లోనే ది బెస్ట్ డిస్ప్లే ఉన్న ఫోన్ xiaomi మి 4i.

దీని క్విక్ స్పెసిఫికేషన్స్ – 5 in 1080P FHD సన్ లైట్ డిస్ప్లే, 3120 mah బ్యాటరీ, 64 బిట్ ఆక్టో కోర్ ప్రొసెసర్, 2GB LPDDR3 ర్యామ్, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్. కాకపోతే అదనపు స్టోరేజ్ సపోర్ట్ లేదు ఇందులో. 4G, డ్యూయల్ సిమ్ డ్యూయల్ స్టాండ్ బై, బెస్ట్ 13MP కెమేరా, 5MP ఫ్రంట్ కెమేరా. అన్ని సైట్లలో 12,999 రూ లకు అందుబాటులో ఉంది ఇప్పుడు.

Press Release
Digit.in
Logo
Digit.in
Logo