Flipkart BBD Sale నుంచి మోటరోలా Edge 70 Fusion ఆల్ టైమ్ చవక ధరలో అందుకోండి.!
Flipkart BBD Sale నుంచి మోటరోలా Edge 70 Fusion ఆల్ టైమ్ చవక ధరలో అందుకోండి
మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్ డీల్ ని ఈరోజు కొత్తగా రిలీజ్ చేసింది
సేల్ నుంచి కేవలం 30 వేల కంటే తక్కువ ధరలో పొందవచ్చని టీజింగ్ చేసింది
Flipkart BBD Sale నుంచి మోటరోలా Edge 70 Fusion ఆల్ టైమ్ చవక ధరలో అందుకోండి. ఈ మాట చెబుతోంది నేను కాదు ఫ్లిప్ కార్ట్. ఎలాగంటే, మొబైల్ డీల్స్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకంగా అందించిన మైక్రో సైట్ టీజర్ పేజి నుంచి ఈరోజు కొన్ని డీల్స్ రివీల్ చేసింది. ఈ డీల్స్ పేజీ నుంచి మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్ డీల్ ని ఈరోజు కొత్తగా రిలీజ్ చేసింది. ప్రస్తుతం 30 వేల రూపాయల కంటే ఎక్కువ ధరలో లభిస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ ని 9వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతున్న ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి కేవలం 30 వేల కంటే తక్కువ ధరలో పొందవచ్చని టీజింగ్ చేసింది.
SurveyFlipkart BBD Sale : Edge 70 Fusion Deal
ప్రస్తుతం మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ ఫ్లిప్ కార్ట్ నుంచి రూ. 30,999 రూపాయల ధరలో లిస్ట్ అయ్యింది. అయితే, ఈ ఫోన్ ప్రస్తుతం స్టాక్ లేదు మరియు నోటిఫై బోర్డు తో లిస్ట్ అయ్యింది. అంటే, ఈ ఫోన్ ప్రస్తుతం అందుబాటులో లేదని మీరు అర్థం చేసుకోవాలి. అయితే, ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి అందుబాటులోకి వస్తుంది.

ఇక ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ ని ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి లభించే ఆఫర్స్ తో రూ. 29,999 రూపాయల ధరలో అందుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. వాస్తవానికి, ఈ ఫోన్ అందించిన అన్ని ఆఫర్స్ తో ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ ను కేవలం రూ. 29,499 రూపాయల డిస్కౌంట్ ధరలో అందుకోవచ్చు.
Also Read: Spotify Down: యుఎస్ మరియు ఇండియాలో మూగబోయిన ప్రముఖ ఆడియో ప్లాట్ ఫామ్.!
మోటోరోలా Edge 70 Fusion : ఫీచర్స్
ఇది మోటరోలా నుంచి వచ్చిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ మరియు క్వాల్కమ్ యొక్క లేటెస్ట్ స్నాప్ డ్రాగన్ 7s Gen 4 చిప్సెట్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్ మరియు 1.5K రిజల్యూషన్ కలిగిన గొప్ప డిస్ప్లే కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 7000 mAh బిగ్ బ్యాటరీ, 68W టర్బో పవర్ ఛార్జ్ మరియు మోటో AI వంటి ప్రీమియం ఫోన్ ఫీచర్స్ ఉంటాయి.
అంతేకాదు, ఈ ఫోన్ 50MP SONY ప్రధాన కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా మరియు గొప్ప సెల్ఫీ కెమెరా కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆల్ రౌండ్ ఫీచర్ తో ఆకట్టుకుంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
