ఇండియాలో పోకో F2 పేరుతొ రెడ్మి 30 ప్రో ని లాంచ్ చేసే అవకాశం

ఇండియాలో పోకో F2 పేరుతొ రెడ్మి 30 ప్రో ని లాంచ్ చేసే అవకాశం
HIGHLIGHTS

రెడ్మి కె 30 4 జి గత ఏడాది చైనాలో లాంచ్ అయింది, తరువాత దీనిని పోకో ఎక్స్ 2 పేరుతో భారతదేశంలో ప్రవేశపెట్టారు. అలాగే, రెడ్మి కె 30 ప్రో ను కూడా ఇదే విధంగా భారత్‌ కు తీసుకురావచ్చని భావిస్తున్నారు. వాస్తవానికి, చైనాలో లాంచ్ చేసిన రెడ్మి కె 30 ప్రో ను పోకో సిరీస్ కింద భారతదేశంలో ప్రవేశపెట్టనున్నట్లు తాజా MIUI కెమెరా కోడ్ వెల్లడించింది. కాబట్టి, ఈ స్మార్ట్‌ ఫోన్ పోకో ఎఫ్ 2 పేరుతొ ఇండియాలో విడుదల కావచ్చు.

ముందుగా, రెడ్మి కె 30 ప్రో యొక్క సంకేతనామం పోకో బ్రాండింగ్‌ తో గుర్తించబడింది. పోకో బ్రాండ్ కింద రెడ్మి కె 30 ప్రో భారతదేశంలో ప్రవేశపెట్టబడుతుందని సంకేతనామంతో పోకో బ్రాండింగ్ ద్వారా మనం ఊహించవచ్చు.

ఇక చైనాలో విడుదల చెయ్యబడిన రెడ్మి K 30 ప్రో విషయానికి వస్తే,  ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 చిప్‌ సెట్ యొక్క శక్తితో పనిచేస్తుంది. ఇది,  LPDDR 5 ర్యామ్, UFS  3.1 స్టోరేజ్ సిస్టమ్ మరియు ఫ్రంట్ ఫేసింగ్ పాప్-అప్ కెమెరాను కలిగి ఉంటాయి. రెడ్మి కె 30 ప్రో లో ఒక 6.67-అంగుళాల 1080p AMOLED  డిస్ప్లే ఉంది. ఇది HDR10 + మరియు 60Hz రిఫ్రెష్ రేటుకు మద్దతు ఇస్తుంది.

ఆప్టిక్స్ పరంగా, రెడ్మి కె 30 ప్రో వృత్తాకార మాడ్యూల్‌ లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది: ఒక 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 13 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్ + 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా + 5 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్  సామర్థ్యాలతో వస్తుంది. ఈ ఫోన్ డిజిటల్‌గా 30x వరకు జూమ్‌ కు మద్దతు ఇస్తాయి మరియు Raw వంటి విభిన్న ఫార్మాట్‌లకు మద్దతు ఇస్తుంది. ముందు భాగంలో 20 మెగాపిక్సెల్ పాప్-అప్ సెల్ఫీ షూటర్ ఉంది.

ఇతర స్పెక్స్‌ విషయానికి వస్తే, 8 కె వీడియో రికార్డింగ్, హెడ్‌ఫోన్ జాక్, IP53 వాటర్ రెసిస్టెన్స్, NFC , IR బ్లాస్టర్, మరియు వై-ఫై 6 ఉన్నాయి. ఇది 4700 ఎమ్ఏహెచ్ బ్యాటరీని ప్యాక్ చేస్తుంది, ఇది యుఎస్‌బి-సి కలిగి 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. రెడ్మి కె 30 ప్రో లో లీనియర్ మోటారుతో నడిచే మెరుగైన హాప్టిక్ ఫీడ్‌బ్యాక్ సిస్టమ్ ఉందని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్‌ లో IP 53 రేటింగ్ కూడా ఉంది, ఇది కొంతవరకు నీటి నిరోధకతను కలిగిస్తుంది

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo