చాలా తక్కువ ధరకే తన 108MP సూపర్ కెమెరా ఫోన్ను విడుదల చేసిన XIAOMI
ఈ స్మార్ట్ ఫోనులో, ఏకంగా 108 MP పెంటా కెమెరా సెటప్ ని అందించింది.
చైనాలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో, షావోమి తన Mi CC 9 Pro స్మార్ట్ ఫోన్ను ఆవిష్కరించింది. ఈ స్మార్ట్ ఫోనులో, ఏకంగా 108 MP పెంటా కెమెరా సెటప్ ని అందించింది. అయితే, షావోమి సంస్థ చైనా మరియు స్పెయిన్ తప్పక మిగిలిన గ్లోబల్ మార్కెట్లలో దీన్ని Mi Note 10 గా ప్రారంభించబోతున్నందున, రేపు నవంబర్ 6 న ఇదే కార్యక్రమాన్ని నిర్వహించనుంది.
Surveyషావోమి మి సిసి 9 ప్రో : స్పెసిఫికేషన్లు
ఈ మి సిసి 9 ప్రో లేదా మి నోట్ 10 పూర్తి-హెచ్‌డి + (1,080 P) రిజల్యూషన్‌తో ఒక 6.47-అంగుళాల వంగిన OLED డిస్ప్లే ఒక డాట్ నోచ్‌ను కలిగి ఉంది. ఇది 19.5: 9 యాస్పెక్ట్ రేషియో మరియు 400000: 1 కాంట్రాస్ట్ రేషియోను అందిస్తుంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730 జి చిప్ సెట్ ద్వారా పనిచేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 6GB లేదా 8GB RAM మరియు 128GB లేదా 256GB అంతర్గత స్టోరేజి ఎంపికలతో ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 9 పై ఆధారిత MIUI 10 పైన నడుస్తుంది.
ఆప్టిక్స్ పరంగా, ఈ మి సిసి 9 ప్రో వెనుక ప్యానల్లోని పెంటా కెమేరాలో, ఒక 108 MP ప్రాధమిక సెన్సార్ + 12 MP సెన్సార్ + 50 X డిజిటల్ జూమ్, 5 X ఆప్టికల్ జూమ్ మరియు 10 X హైబ్రిడ్ జూమ్ + 5 MP హైబ్రిడ్ జూమ్ + 20 MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ + మాక్రో షాట్ల కోసం 2 MP సెన్సార్ కలిగి ఉంటుంది. ఇంకా, ముందు డాట్ నోచ్ లో ఒక 32 MP సెల్ఫీ షూటర్ ఉంది. అత్యధికమైన జూమ్ సామర్థ్యాలతో పాటు, ఈ మి సిసి 9 ప్రో లో ఐ బ్యూటీ, AI సీన్ రికగ్నిషన్, పోర్ట్రెయిట్ మోడ్, సూపర్ నైట్ సీన్ మోడ్ మరియు 4 కె వీడియో షూటింగ్ (వెనుక) వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఈ ఫోనులో ఒక 30W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి మద్దతు కలిగిన పెద్ద 5260mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇది NFC, Hi-Res ఆడియోకు మద్దతు ఇస్తుంది. ప్రపంచంలో, అల్ట్రా-థిన్ ఆప్టికల్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉన్న మొట్టమొదటి ఫోనుగా ఈ మి సిసి 9 ప్రో గురించి, షావోమి గొప్పగా చెప్పుకుంటుంది. స్మార్ట్ ఫోనులో బ్రీతింగ్ లైట్ లక్షణం కూడా ఉంది, ఇది ఫోన్‌కు నోటిఫికేషన్ వచ్చినప్పుడు అంచులను మెరిసేలా చేస్తుంది.
షావోమి మి సిసి 9 ప్రో : ధర
ఈ షావోమి మి సిసి 9 ప్రో ధర 2,799 యువాన్, ఇది బేస్ 6 జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ మోడల్ కోసం మనకు సుమారు రూ .28,200 గా ఉంటుంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ వేరియంట్ ధర 3,099 యువాన్, అంటే రూ .31,200(సుమారుగా). మరోవైపు, ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధర 3,499 యువాన్, ఇది సుమారు రూ .35,000 గా ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
