Redmi A7 మరియు A7 Pro రెండు బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేసిన షియోమీ.!

HIGHLIGHTS

షియోమీ ఈరోజు Redmi A7 మరియు A7 Pro రెండు బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేసింది

A7 సిరీస్ నుంచి ముందుగా రెడ్ మీ A7 ప్రో 5G స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది

ఇప్పుడు ఇదే సిరీస్ నుంచి రెండు కొత్త 4జి స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లో ప్రవేశపెట్టింది

షియోమీ ఈరోజు ఇండియన్ మార్కెట్లో Redmi A7 మరియు A7 Pro రెండు బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేసింది. A7 సిరీస్ నుంచి ముందుగా రెడ్ మీ A7 ప్రో 5G స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. ఇప్పుడు ఇదే సిరీస్ నుంచి రెండు కొత్త 4జి స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లో ప్రవేశపెట్టింది. షియోమీ కొత్తగా విడుదల చేసిన ఈ రెండు స్మార్ట్ ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దామా.

Redmi A7 మరియు A7 Pro : ప్రైస్

రెడ్ మీ ఈ రెండు ఫోన్లను కూడా కేవలం సింగల్ వేరియంట్స్ లో మాత్రమే అందించింది. ఇందులో రెడ్ మీ A7 ఫోన్ (3GB + 64GB) సింగల్ వేరియంట్ లో కేవలం రూ. 10,499 ప్రైస్ తో లాంచ్ అయ్యింది. అలాగే, రెడ్ మీ A7 ప్రో స్మార్ట్ ఫోన్ (4GB + 64GB) సింగల్ వేరియంట్ తో కేవలం రూ. 11,499 ధరలో లాంచ్ చేసింది.

ఈ రెడ్ మీ ఏ 7 ప్రో సన్ సెట్ ఆరెంజ్ మరియు బ్లాక్ రెండు రంగుల్లో లభిస్తుంది. అయితే, రెడ్ మీ ఏ 7 మాత్రం బ్లాక్ అండ్ స్కై బ్లూ రంగుల్లో లభిస్తుంది. ఈ రెడ్ మీ కొత్త ఫోన్లు ఏప్రిల్ 24వ తేదీ నుంచి సేల్ అవుతాయి. ఈ రెండు ఫోన్లు కూడా అమెజాన్ ఇండియా మరియు షియోమీ అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి లభిస్తాయి.

Also Read: RBI కొత్త నిర్ణయం: Auto Debit లిమిట్ రూ. 15,000 కి పెంచిన రిజర్వ్ బ్యాంక్.!

Redmi A7 మరియు A7 Pro : ఫీచర్స్

రెడ్ మీ ఏ 7 స్మార్ట్ ఫోన్ 6.88 ఇంచ్ స్క్రీన్ కలిగి ఉంటే ఏ 7 ప్రో మాత్రం కొంచెం పెద్దదైన 6.9 ఇంచ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ రెండు ఫోన్లు కూడా HD+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటాయి. ఈ రెండు ఫోన్లు కూడా UNISOC T7250 చిప్ సెట్ తో లాంచ్ అయ్యాయి. ఏ 7 ఫోన్ లో 3GB ర్యామ్ ఉంటే, ఏ 7 ప్రో మాత్రం 4GB ర్యామ్ కలిగి ఉంటుంది. ఈ రెండు ఫోన్లు కూడా 64GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటాయి. ఈ ఫోన్ కలిగిన ర్యామ్ కి సమానమైన వర్చువల్ ర్యామ్ ఫీచర్ కూడా ఉంటుంది.

కెమెరా విభాగానికి వస్తే, ఈ రెండు ఫోన్లు కూడా వెనుక 13MP సింగల్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటాయి. ఈ ఫోన్ లో 200% వాల్యూమ్ కలిగిన మోనో స్పీకర్ ఈ రెండు ఫోన్స్ లో ఉంటుంది. ఈ రెండు ఫోన్లు కూడా 6300 mAh బిగ్ బ్యాటరీ మరియు 15W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో ఉంటాయి. అంతేకాదు, ఈ రెండు ఫోన్లు రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటాయి.

ఈ ఫోన్లు బడ్జెట్ ధరలో వచ్చినా Hyper OS 3.0 జతగా ఆండ్రాయిడ్ 16 OS తో వస్తాయి. అంతేకాదు, 4 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ మరియు ఆరు సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్ అప్‌డేట్స్ కూడా అందుకుంటాయి. ఈ రెండు ఫోన్లో కూడా IP52 రేటింగ్ తో వస్తాయి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :