RBI కొత్త నిర్ణయం: Auto Debit లిమిట్ రూ. 15,000 కి పెంచిన రిజర్వ్ బ్యాంక్.!

HIGHLIGHTS

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక కీలక నిర్ణయం తీసుకుంది

Auto Debit లిమిట్ రూ. 15,000 కి పెంచినట్లు RBI తెలిపింది

కొత్త పేమెంట్ పెరుగుదలతో బిల్ పేమెంట్ ఫెయిల్యూర్ తగ్గుతుంది

RBI కొత్త నిర్ణయం: Auto Debit లిమిట్ రూ. 15,000 కి పెంచిన రిజర్వ్ బ్యాంక్.!

దేశంలో రోజురోజుకు పెరుగుతున్న డిజిటల్ పేమెంట్స్ ప్రాధాన్యత మరియు సంఖ్య దృష్టిలో ఉంచుకొని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. Auto Debit లిమిట్ రూ. 15,000 కి పెంచినట్లు తెలిపింది. ఈ కొత్త మార్పుతో ఇన్సూరెన్స్ ప్రీమియం, SIP లు మరియు రికరింగ్ వంటి పెద్ద పేమెంట్స్ సైతం ఆటో డెబిట్ తో సెట్ చేసుకొని పేమెంట్ చేయోచ్చు. ఈ కొత్త నిర్ణయంతో సాధారణ వినియోగదారులకు ఎలా ఉపయోగం చేకూరుతుంది మరియు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో క్లియర్‌గా చూద్దాం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Auto-Debit అంటే ఏమిటి?

అన్నింటి కన్నా ముందు అసలు ఆటో డెబిట్ ఏమిటో తెలిస్తే, ఈ కొత్త నిర్ణయంతో ప్రజలకు కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుస్తుంది. ఆటో డెబిట్ అంటే మీరు మీ బ్యాంక్ UPI ద్వారా ఒకసారి అనుమతి ఇస్తే, మీ బ్యాంకు ఖాతా నుంచి నిర్దిష్ట సమయంలో డబ్బు ఆటోమేటిక్‌గా డెడక్ట్ అవుతుంది. అంటే, OTT సబ్స్క్రిషన్, మొబైల్ రీఛార్జ్ లేదా ఎలక్ట్రిసిటీ వంటి వాటికి నెలల నెల బిల్ కోసం ఎదురు చూడకుండా ఆటో మెటిక్ గా పేమెంట్ కోసం చేసే ఆటో డెబిట్ పేమెంట్ గురించే ఇప్పుడు చెబుతోంది.

RBI కొత్త నిర్ణయం: Auto Debit లిమిట్ ఏమిటి?

ఇప్పటి వరకు రూ. 5,000 రూపాయలు మాత్రమే ఉన్న Auto-debit (e-mandate) లిమిట్‌ ను రిజర్వ్ బ్యాంక్ ఇప్పుడు ఏకంగా రూ. 15,000 రూపాయల వరకు పెంచేసింది. దీని వలన ముందు బిల్ పేమెంట్ ఫెయిల్యూర్ తగ్గుతుంది. అంటే, ముందు ఉన్న రూ. 5000 లిమిటెడ్ కంటే ఎక్కువగా వచ్చే పెద్ద బిల్లులు పేమెంట్ ఫెయిల్ అయ్యేవి. అయితే, ఈ కొత్త నిర్ణయంతో ఇప్పుడు ఈ సమస్య తగ్గుతుంది.

RBI New Rule on Auto Debit

ఇది మాత్రమే కాదు రూ. 15,000 కంటే తక్కువగా ఉన్న పేమెంట్ కోసం ప్రతి సారి OTP ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా, రికరింగ్ పేమెంట్స్ ఆటోమేటిక్‌గా పూర్తవుతాయి. దీనితో టైమ్ సేవ్ అవుతుంది మరియు పేమెంట్ కూడా సకాలంలో చెల్లించబడతాయి.

కొత్త సేఫ్టీ రూల్స్

కొత్త ఆటో డెబిట్ లిమిట్ ఎక్స్టెన్షన్ తో పాటు రిజర్వ్ బ్యాంక్ కొన్ని ముఖ్యమైన సెక్యూరిటీ నిబంధనలు కూడా పెట్టింది. అవేమిటంటే, ప్రతి ట్రాన్సాక్షన్‌ పేమెంట్ కు 24 గంటల ముందుగా దాని గురించి నోటిఫికేషన్ వస్తుంది. అలాగే, పేమెంట్ రూ.15,000 దాటితే OTP తప్పనిసరి. అంతేకాదు, మీరు ఎప్పుడైనా మ్యాండేట్ క్యాన్సిల్ చేయవచ్చు. ఈ నియమాలు ప్రజల డబ్బు సేఫ్‌ గా ఉండేలా చూస్తాయి.

Also Read: Motorola Edge 70 Pro: సూపర్ నైట్ కెమెరా మరియు పవర్ ఫుల్ చిప్ సెట్ తో రిలీజ్.!

జాగ్రత్తలు అవసరం

ఈ ఫీచర్ కచ్చితంగా ఉపయోగకరమైనదే, కానీ జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. మీరు ఎన్ని సబ్స్క్రిప్షన్ ఇచ్చారో రెగ్యులర్ గా చెక్ చేయండి. అవసరం లేని ఆటో డెబిట్ పేమెంట్ లను క్యాన్సిల్ చేయండి. మీ బ్యాంక్ SMS మరియు Email అలర్ట్స్ ను ఎల్లవేళలా చెక్ చేయండి. ఎందుకంటే, చిన్న నిర్లక్ష్యం వల్ల డబ్బు వృధా అయ్యే అవకాశం ఉంటుంది.

ఇక ఈ కొత్త అప్డేట్ గురించి క్లియర్ గా చెప్పాలంటే, కొత్త నిర్ణయంతో రిజర్వ్ బ్యాంక్ డిజిటల్ పేమెంట్స్‌ మరింత సులభం చేసింది. అయితే, పేమెంట్ కంట్రోల్ పూర్తిగా అకౌంట్ హోల్డర్స్, అంటే మీ చేతుల్లో ఉంటుంది. కాబట్టి, మీరు ‘పర్మిషన్’ మరియు ‘మ్యాండేట్స్’ సరిగ్గా అమలు చేస్తే మాత్రమే ఇది పూర్తిగా సేఫ్ అవుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo