Xiaomi మి 4i 32GB వెర్షన్ రిజిస్ట్రేషన్స్ మొదలయ్యాయి
Xiaomi మి 4i గతంలో 16 gb వెర్షన్ లాంచ్ చేసింది. దీనికి అదనపు మెమరి కార్డ్ సపోర్ట్ లేకపోవడం వలన ఫోన్ అన్ని విభాగాల్లో బాగా నచ్చినా కొంతమంది కొనటానికి ఇష్టం చూపించలేకపోయారు. ఇప్పుడు Xiaomi 32 GB మి 4i వెర్షన్ ను లాంచ్ చేస్తుంది.
Surveyఇది కొనే ఉద్దేశం ఉన్న వాళ్లు ఈ రోజు ప్రారంభం అయిన రిజిస్ట్రేషన్లు ప్రక్రియ లో రిజిస్టర్ చేసుకోగలరు. జులై 28 న 2PM కు మొబైల్ మొదటి ఫ్లాష్ సేల్స్ చేయనుంది. దీని ధర 14,999 రూ. 16 GB Xiaomi మి 4i ధర 12,999 రూ. 32 gb వెర్షన్ లో కేవలం డార్క్ గ్రే బ్యాక్ కలర్ లోనే వస్తుంది మొబైల్. ఈ లింక్ లో రిజిస్టర్ చేసుకోగలరు.
ఇదే సమయంలో 16 gb సేల్స్ తగ్గకుండా ఉండటానికి 16 మి 4i మోడల్ పై 500 కూపన్ ఇస్తుంది కంపెని. అయితే 32 gb మి 4i వెర్షన్ ను కేవలం అధికారిక Xiaomi వెబ్ సైటు లోనే కొనటానికి అవకాసం ఇచ్చింది కంపెని. ఫోన్ స్పెక్స్ సేం మి 4i 16 GB మోడల్ వలె ఉంటాయి. కేవలం స్టోరేజ్ కెపాసిటీ పెరుగుతుంది. ఈ మొబైల్ మంచి మోడల్. ఒక్క ప్రొసెసర్ హిటింగ్ ఇష్యూ కారణంగా ఫోన్ పెర్ఫార్మన్స్ తగ్గటం మినహా అంతా బాగుంటుంది ఫోన్. Xiaomi మి 4i పూర్తి తెలుగు రివ్యూ ను ఇక్కడ చదవండి.
The one that switches between BMWs and Harbour Line Second Class. View Full Profile