షావోమి దీపావళి క్రేజీ డీల్ : Mi LED Wi-Fi స్మార్ట్ బల్బ్ రూ. 699 మాత్రమే
నేరుగా 400 రుపాయల డిస్కౌంట్ ఈ స్మార్ట్ బల్బ్ పైన అందుకోవచ్చు
దీపావళి సందర్భంగా షావోమి తన "Celebrate Diwali with Mi" సేల్ ప్రకటించిన విషయం తెలిసిందే. సేల్ రేపటితో ముగుస్తుండగా రేపు మంచి డీల్స్ ప్రకటించింది. వాటిలో, ముఖ్యంగా Mi LED Wi-Fi స్మార్ట్ బల్బ్ పైన క్రేజీ డీల్ ద్వారా దీన్ని కేవలం రూ. 699 ధరకే అమ్ముడుచేయనుంది. వాస్తవినికి, ఈ LED ను రూ.1,099 ధరతో అమ్ముడిచేసింది. అంటే, నేరుగా 400 రుపాయల డిస్కౌంట్ ఈ స్మార్ట్ బల్బ్ పైన అందుకోవచ్చు.
Surveyషావోమి LED స్మార్ట్ బల్బ్ ప్రత్యేకతలు :
ఈ స్మార్ట్ LED బల్బ్ చూడటానికి మన సాధారణ LED బల్బుల వలెనే కనిపిస్తుంది. కానీ, ఇది అందించే కలర్ వైవిధ్యాలను చూస్తే, నిజంగా ఆశ్చర్యతోవాల్సిందే. ఎందుకంటే, ఇది 16M కలర్ ఎంపికలతో వస్తుంది. అవును మీరు విటుంది నిజమే, దీనితో ఈ 16 మిలియన్ కలర్ అప్షన్లలో కావాల్సిన దాన్ని ఎంచుకోవచ్చు. అంతేకాదు, దీన్ని మీ మొబైల్ ఫోనుతో కంట్రోల్ చేయ్యవచ్చు మరియు 11 సంవత్సరాల దీర్ఘ కాలం పనిచేసేలా దీన్ని అందించింది షావోమి సంస్థ.
అధనంగా, ఈ షావోమి స్మార్ట్ LED బల్బు Alexa మరియు గూగుల్ అసిస్టెంట్ వంటి వాటికీ అనుగుణముగా నడుచుకుంటుంది, అంటే వాటి ఆజ్ఞలను పాటిస్తుంది. ఈ విషయం నిజంగా మెచ్చుకోతగినది మరియు ఇప్పటి వరకు ఎవరికి రానటువంటి ఆలోచనగా చెప్పుకోవచ్చు. అలాగే, దీన్ని మనం క్యాండిల్ లైట్, స్టూడియో లైట్, మ్యాచ్ లైట్, లేదా ఫ్లోరా సేంట్ లాంప్ లాగా అనేక విధాలుగా వాడుకోవచ్చు. దీన్ని Mi Home App తో చక్కగా మరియు సులభంగా కంట్రోల్ చెయ్యవచు. ఇది 10W సమర్థ్యం తో వస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
