Mi A3 లాంచ్ డేట్ ఖాయం చేసిన షావోమి : ఇవే ప్రత్యేకతలు

Updated on 15-Jul-2019
HIGHLIGHTS

ఒక 6.08-అంగుళాల AMOLED డిస్ప్లేతో పరికరం రావచ్చని ఇమేజ్ రిటైల్ బాక్స్ సూచిస్తుంది.

షావోమి తన Mi A3 ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్లను త్వరలో విడుదల చేయనున్నట్లు చాలా పుకార్లు వచ్చాయి మరియు కంపెనీ ఈ ఫోన్ లాంచ్ కోసం తేదీని నిర్ణయించినట్లు తెలుస్తోంది. షావోమి, జూలై 25 న పోలాండ్‌లోని వార్సాలో ఒక లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించనుంది మరియు దాని రూపాన్ని చూస్తే, అది మి A3 ఇన్‌బౌండ్ కావచ్చనిపిస్తోంది. కొత్త టీజర్‌లోఫోన్ ఒక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను పోలి ఉంటుంది. కంపెనీ ఇటీవల విడుదల చేసిన మి సిసి 9 e ని Mi A3 గా రీబ్రాండ్ చేసి స్టాక్ ఆండ్రాయిడ్ ఓఎస్‌లో నడుస్తున్న ఆండ్రాయిడ్ వన్ డివైస్‌గా లాంచ్ చేయగలదని సూచిస్న్తున్నాయి ఈ పుకార్లు.

పోలాండ్‌లో జరుగనూన్న ఈ లాంచ్ ఈవెంట్ జూలై 25 న సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. బ్లాగ్ పోస్ట్‌లో ఈ లాంచ్ గురించి మాట్లాడుతున్న షియోమి, కొంతమంది వినియోగదారులను కూడా ఈ విడుదల కార్యక్రమానికి హాజరుకావదానికి కూడా ఆహ్వానిస్తుందని, జూలై 16 వరకు రిజిస్ట్రేషన్లను అనుమతిస్తున్నట్లు చెప్పారు. వినియోగదారులు తమ వినియోగదారు పేరు మరియు Mi ఐడిని కంపెనీకి ఇమెయిల్ ద్వారా పంపడం ద్వారా లాంచ్‌లో పాల్గొనవచ్చు. వారు తమ గురించి ఏదో ఒక విశేషం గురించి చెప్పాలి, వారు ఈ కార్యక్రమానికి ఎందుకు హాజరు కావాలి మరియు వారు ఎక్కడ నుండి రానున్నారో కూడా తెలియపరచాలి. కాబట్టి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

షియోమి Mi A3 యొక్క అధికారిక వివరాలు ఇంకా బయటపడకపోగా, ఈ హ్యాండ్‌సెట్ ఇటీవల రెండు లైవ్ ఇమేజ్‌లతో లీక్ అయ్యింది, ఇది దాని రిటైల్ బాక్స్‌ను కూడా చూపించారు. ఈ చిత్రాల ప్రకారం, మి A3 గుర్తించదగిన డిస్ప్లేను కలిగి ఉంటుంది మరియు నిలువుగా ఉంచిన ట్రిపుల్ వెనుక కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. వెనుకవైపు ఆండ్రాయిడ్ వన్ లోగో కూడా ఉంది. అండర్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో కూడిన ఒక 6.08-అంగుళాల AMOLED డిస్ప్లేతో పరికరం రావచ్చని ఇమేజ్ రిటైల్ బాక్స్ సూచిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ యొక్క ఇతర లక్షణాలుగా 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4030 ఎమ్ఏహెచ్ బ్యాటరీ మరియు 48 ఎంపి వెనుక కెమెరాను సూచిస్తున్నాయి. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :