108MP కెమెరాతో వస్తున్న Redmi Note 11s స్మార్ట్ ఫోన్

HIGHLIGHTS

Redmi Note 11s 1 భారీ కెమెరాతో వస్తోంది

ఫిబ్రవరి 9 న విడుదలకానున్న స్మార్ట్ ఫోన్

క్వాడ్ కెమెరా సెటప్ తో వస్తోంది

108MP కెమెరాతో వస్తున్న Redmi Note 11s స్మార్ట్ ఫోన్

షియోమి ఇండియాలో విడుదల చెయ్యనున్న అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Redmi Note 11s యొక్క కెమెరా విషయాలను వెల్లడించింది.  ఈ స్మార్ట్ ఫోన్ ను 108MP  కెమెరాతో తీసుకువస్తునట్లు కంపెనీ ప్రకటించింది. Redmi Note 11s స్మార్ట్ ఫోన్ ను ఫిబ్రవరి 9 న విడుదల చేస్తున్నట్లు షియోమి ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ గురించిన అంచనా స్పెక్స్ ను క్రింద చూడవచ్చు.    

Digit.in Survey
✅ Thank you for completing the survey!

షియోమి వెబ్సైట్ నుండి అందించిన Redmi Note 11s టీజింగ్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ క్వాడ్ కెమెరా సెటప్ కి జతగా ఒక LED ఫ్లాష్ ను కూడా కలిగివుంది. అలాగే, ఈ స్మార్ట్ ఫోన్ 108-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాని కలిగి ఉన్నట్లుగా ప్రకటించగా, రెండు 2MP సెన్సార్ లతో పాటుగా 8MP సోనీ IMX355 సెన్సార్‌తో కూడా రావచ్చని భావిస్తున్నారు. అయితే, ఈ ఫోన్ పైన ఎటువంటి 5G బ్రాండింగ్ లేకపోవడం వలన ఇది 4G సపోర్ట్ తో రావచ్చని సూచిస్తుంది.

వాస్తవానికి, గత నెలలో షియోమి తన Redmi 11 సిరీస్ నుండి బడ్జెట్ 16 వేల బడ్జెట్ ధరలోనే Redmi Note 11T 5G తీసుకొచ్చింది. కాబట్టి, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ 15 వేల రూపాయల సబ్ కేటగిరిలో రావచ్చని కూడా అంచనా వేస్తున్నారు. ధర విషయం పక్కన పెడితే, షియోమి ఈ ఫోన్  ఫీచర్లను ఒక్కొక్కటిగా రివీల్ చేయనున్నది కాబట్టి, మరింత సంచారంతో మీ ముందుకు వస్తాము.        

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile