గతవారం, షావోమి త్వరలో ఒక కొత్త మొబైల్ ఫోన్ తీసుకురానున్న విషయం గురించి కొంత సమాచారం వెల్లడైంది. ఈ ఫోనులో ఒక 64MP క్వాడ్-కెమెరా సెటప్ పొందబోతున్నారు. ఈ స్మార్ట్ ఫోన్, ఈ సంవత్సరం Q4 నాటికల్లా మార్కెట్లో వచ్చే అవకాశాలు ఉన్నట్లు షావోమి కంపెనీకి చెందిన విపి, వీబింగ్ ద్వారా అందించిన ఒక వీడియో ద్వారా తెలుస్తోంది. ఈ మొబైల్ ఫోన్ యొక్క ఉత్పత్తి ఈ వీడియోలో చూపబడింది. ఈ వీడియో నుండి ఈ మొబైల్ ఫోన్ గురించి చాలా కొత్త అంశాలు మన ముందుకు తీసుకొచ్చిందని చెప్పొచ్చు.
ఈ వీడియోలో, ప్రధానంగా కెమెరా గురించి ఎక్కువగా సమాచారం ఉంది, ఈ వీడియో క్లిప్‌లో, మూడు కెమెరాలు నిలువు రూపంలో ఉంచినట్లు చూపింది, అలాగే మరొకటి అంటే నాల్గవ కెమెరా కుడి వైపున ఉంచబడింది.
ఇది కాకుండా, ఈ మొబైల్ ఫోన్లో కెమెరాను పాప్-అప్ మెకానిజంగా లేదని ఈ వీడియో ద్వారా తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో, మీరు ఒక నోచ్ డిజన్ మరియు అందులో సెల్ఫీ కెమెరాను అందుకుంటారు. అదే విధంగా ఈ మొబైల్ ఫోన్లో మీరు నోచ్ డిస్ప్లే ను పొందుతారాని నిర్ధారిస్తోంది.
ఇది కాకుండా, ఈ సంస్థ యొక్క VP ఒక ప్రకటనను విడుదల చేశారు. అదేమిటంటే, ఈ మొబైల్ ఫోన్ అంటే ఈ క్వాడ్-కెమెరా మొబైల్ ఫోన్‌ను 15 రోజుల ముందుగానే ఉత్పత్తిలోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. అయితే, ఈ సమాచారం కాకుండా, ఈ మొబైల్ ఫోన్ గురించి ఎటువంటి సమాచారం వెల్లడించలేదు. అయితే రాబోయే కాలంలో ఈ మొబైల్ ఫోన్ గురించి మనకు చాలా సమాచారం అందనున్నదని చెప్పవచ్చు.