షావోమి 64MP క్వాడ్ కెమేరా ఫోనుతో దూసుకొస్తోంది: వీడియో విడుదల

షావోమి 64MP క్వాడ్ కెమేరా ఫోనుతో దూసుకొస్తోంది: వీడియో విడుదల
HIGHLIGHTS

ఈ మొబైల్ ఫోన్‌లో కెమెరాను పాప్-అప్ మెకానిజంగా లేదని ఈ వీడియో ద్వారా తెలుస్తోంది.

గతవారం, షావోమి త్వరలో ఒక కొత్త మొబైల్ ఫోన్ తీసుకురానున్న విషయం గురించి కొంత సమాచారం వెల్లడైంది. ఈ ఫోనులో ఒక 64MP క్వాడ్-కెమెరా సెటప్  పొందబోతున్నారు. ఈ స్మార్ట్ ఫోన్, ఈ సంవత్సరం Q4 నాటికల్లా మార్కెట్లో వచ్చే అవకాశాలు ఉన్నట్లు షావోమి కంపెనీకి చెందిన విపి, వీబింగ్ ద్వారా అందించిన ఒక వీడియో ద్వారా తెలుస్తోంది. ఈ మొబైల్ ఫోన్ యొక్క ఉత్పత్తి ఈ వీడియోలో చూపబడింది. ఈ వీడియో నుండి ఈ మొబైల్ ఫోన్ గురించి చాలా కొత్త అంశాలు  మన ముందుకు  తీసుకొచ్చిందని చెప్పొచ్చు.

ఈ వీడియోలో, ప్రధానంగా కెమెరా గురించి ఎక్కువగా సమాచారం ఉంది, ఈ వీడియో క్లిప్‌లో, మూడు కెమెరాలు నిలువు రూపంలో ఉంచినట్లు చూపింది, అలాగే మరొకటి అంటే నాల్గవ కెమెరా కుడి వైపున ఉంచబడింది.

ఇది కాకుండా, ఈ మొబైల్ ఫోన్‌లో కెమెరాను పాప్-అప్ మెకానిజంగా లేదని ఈ వీడియో ద్వారా తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో, మీరు ఒక నోచ్ డిజన్ మరియు అందులో సెల్ఫీ కెమెరాను అందుకుంటారు. అదే విధంగా ఈ మొబైల్ ఫోన్‌లో మీరు నోచ్ డిస్ప్లే ను పొందుతారాని నిర్ధారిస్తోంది.

ఇది కాకుండా, ఈ సంస్థ యొక్క VP ఒక ప్రకటనను విడుదల చేశారు. అదేమిటంటే,  ఈ మొబైల్ ఫోన్ అంటే ఈ క్వాడ్-కెమెరా మొబైల్ ఫోన్‌ను 15 రోజుల ముందుగానే ఉత్పత్తిలోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. అయితే, ఈ సమాచారం కాకుండా, ఈ మొబైల్ ఫోన్ గురించి ఎటువంటి సమాచారం వెల్లడించలేదు. అయితే రాబోయే కాలంలో ఈ మొబైల్ ఫోన్ గురించి మనకు చాలా సమాచారం అందనున్నదని చెప్పవచ్చు.

VIA : 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo