Redmi Note 12 5G పైన భారీ డిస్కౌంట్ అఫర్ ప్రకటించిన షియోమి.!

HIGHLIGHTS

Redmi Note 12 5G ఇప్పుడు భారీ డిస్కౌంట్ అఫర్ తో లభిస్తోంది

బడ్జెట్ ధరలో స్నాప్ డ్రాగన్ 4Gen 1 చిప్ సెట్ ఫోన్

రెడ్ మి నోట్ 12 5G షియోమి వెబ్సైట్ నుండి భారీ డిస్కౌంట్ ఆఫర్ల తో సేల్ అవుతోంది

Redmi Note 12 5G పైన భారీ డిస్కౌంట్ అఫర్ ప్రకటించిన షియోమి.!

షియోమి లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ Redmi Note 12 5G ఇప్పుడు భారీ డిస్కౌంట్ అఫర్ తో లభిస్తోంది. బడ్జెట్ ధరలో స్నాప్ డ్రాగన్ 4Gen 1 చిప్ సెట్, 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన AMOLED డిస్ప్లే వంటి మరిన్ని ఫీచర్లు కలిగిన Redmi Note 12 ప్రస్తుతం షియోమి వెబ్సైట్ నుండి భారీ డిస్కౌంట్ ఆఫర్ల తో సేల్ అవుతోంది. నోట్ 12 5జి స్మార్ట్ ఫోన్ పైన షియోమి అందించిన ఆఫర్ల పైన ఒక లుక్కేద్దామా. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Redmi Note 12 5G: అఫర్లు 

రెడ్ మి నోట్ 12 5G స్మార్ట్ ఫోన్ యొక్క అన్ని వేరియంట్స్ పైన బ్యాంక్ మరియు ఎక్స్ చేంజ్ బోనస్ ను కూడా షియోమి అఫర్ చేస్తోంది. ఈ ఫోన్ యొక్క బేసిక్ వేరియంట్ (4GB+128GB) రూ. 17,999 రూపాయల ధరతో లాంచ్ అవ్వగా, షియోమి ప్రస్తుతం ఈ ఫోన్ ను రూ. 1,000 డిస్కౌంట్ తో రూ. 16,999 అఫర్ ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ ను HDFC క్రెడిట్ కార్డ్ మరియు EMI తో లేదా ICICI బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ తో కొనుగోలు చేస్తే రూ. 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ ను పొందవచ్చు. ఇది మాత్రమే కాదు కాదు మీ పాత ఫోన్ ఎక్స్ ఛేంజ్ పైన అదనపు బోనస్ కూడా పొందే వీలుంది.

షియో`షియోమి & రెడ్ మి ఫోన్ల ఎక్స్ ఛేంజ్ పైన రూ. 2,000 అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ను, ఇతర బ్రాండ్ ఫోన్ల పైన రూ. 1,500 రూపాయల బోనస్ ను అఫర్ చేస్తోంది. అంటే, ఈ ఆఫర్ల ద్వారా రెడ్ మి నోట్ 12 5G స్మార్ట్ ఫోన్ ను రూ. 12,999 రూపాయల తక్కువ ధరకే కొనుగోలు చేసే వీలుంది.

 

 

Redmi Note 12 5G ప్రధాన ఆకర్షణలు ఏమిటి?

ఇక రెడ్ మి నోట్ 12 5G స్మార్ట్ ఫోన్ యొక్క ప్రధాన ఆకర్షణలు ఏమిటి అని చూస్తే, ఈ స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1200 నిట్స్ బ్రైట్నెస్ సపోర్ట్ కలిగిన 6.7 ఇంచ్ FHD+ Super AMOLED డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 Gen 1 చిప్ సెట్, 48MP AI ట్రిపుల్ రియర్ కెమేరా, 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన బిగ్ బ్యాటరీ మరియు Hi-Res Audio సపోర్ట్ వంటి ప్రధాన ఆకర్షణలు ఈ ఫోన్ లో ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo