షావోమి A3 వచ్చేసింది : ధర, స్పెక్స్ మరియు ప్రత్యేకతలు.
షావోమి, స్పెయిన్ లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రం ద్వారా తన Mi A సిరీస్ నుండి మరొక కెమేరా ఫీచర్ ఫోన్ను విడుదల చేసింది. 2018 సంవత్సరంలో ఉత్తమ మిడ్ రేంజ్ కెమేరా ఫోనుగా నిలచిన Mi A2 యొక్క తరువాతి తరం స్మార్ట్ ఫోనుగా దీన్ని తీసుకొచ్చింది. ఈ Mi A3 స్మార్ట్ ఫోన్, ప్రస్తుతం మార్కెట్లో ట్రెండీగా నడుస్తునటువంటి, ట్రిపుల్ రియర్ కెమేరా, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు గొప్ప సెల్ఫీ కెమేరాతో పాటుగా ఒక కొత్త ప్రాసెసరుతో విడుదల చెయ్యబడింది.
SurveyMi A3 ప్రత్యేకతలు
ఈ మి A3, ఒక డాట్ డ్రాప్ నోచ్ డిజైన్ కలిగినటువంటి, ఒక 6.08 -అంగుళాల HD+ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది 19.5:9 ఆస్పెక్ట్ రేషియాతో 1560 x 720 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందిస్తుంది. ఈ ఫోను దీని డిస్ప్లే యొక్క క్రిందభాగంలో ఒక ఇన్ -స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ను కలిగి ఉంది. ఈ ఫోన్ గరిష్టంగా 2.0 క్లాక్ స్పీడ్ అందించగల ఒక 11nm finfit కలిగిన క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 665 ఆక్టా కోర్ SoC కి జతగా 4GB RAM వేరియంట్లలో 64GB లేదా 128GB స్టోరేజిలలో లభిస్తాయి. అలాగే, ఒక మెమొరీ కార్డు ద్వారా 256GB వరకూ స్టోరేజిని పెంచుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్, ఒక 4,030 mAh బ్యాటరీ మరియు 18 W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది. అయితే, బాక్సులో మాత్రం 10 వాట్స్ చార్జరును మాత్రమే అందిస్తుంది.
ఇక ఈ ఫోన్ యొక్క కెమేరా విభాగానికి వస్తే, ఇది పోర్ట్రైట్ షాట్లకు అనుగుణంగా ఒక 2MP మూడవ సెన్సారుతో జతగా కలిపిన ప్రధాన 48MP సోనీ సెన్సారు మరియు మరొక 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియార్ కెమేరాతో ఉంటుంది. ఈ Mi A3 యొక్క 48MP ప్రధాన కెమేరా f/1.79 అపర్చరుతో అందించబడింది. ఇది తక్కువ కాంతి లో కూడా మంచి షాట్లు తీసుకోవటానికి సహాయపడుతుంది. ఇక ముందుభాగంలో, పోర్త్రైట్ మోడ్ మరియు పేస్ అన్లాక్ కి సపోర్ట్ చేసేలా, AI అల్గారిథం కలిగిన ఒక 32MP కెమెరా ఉంటుంది. ముఖ్యంగా, ఇది ఆండ్రాయిడ్ వన్ కార్యక్రమంలో భాగంగా ఉంటుంది కాబట్టి, రెండు ప్రధాన అప్డేట్లను ఖచ్చితంగా అందుకుంటారు.
అయితే, ఈ స్మార్ట్ ఫోన్ యొక్క సాధారణ వేరియంట్ 249 యూరోల ధరగా ప్రకటించింది. అంటే, ఇది మనకు కరెన్సీలోకి ఈ రోజు ప్రకారంగా మర్చి చూస్తే సుమారు రూ.19,290 రూపాయలకు సమానంగా ఉంటుంది. ఇక మరొక వేరియంట్ ని 279 యూరోల ధరతో తీసుకొచ్చింది. ఇది మనకు కరెన్సీలోకి ఈ రోజు ప్రకారంగా మర్చి చూస్తే సుమారు రూ. 21,600 రూపాయలకు సమానంగా ఉంటుంది.
ఈ ఫోన్ లాంచ్ కార్యక్రమంలో ఈ ఫోన్ ఇండియాలో ఎప్పుడు విడుదల చేయనున్న విషయాన్ని తెలియ చేయలేదు. కానీ, అతిత్వరలోనే ఈ స్మార్ట్ ఫోన్ను ఇండియాలో లాంచ్ చేయవచ్చని భావిస్తున్నారు.