Xiaomi 17T ఇండియా లాంచ్ డేట్ అనౌన్స్ చేసిన షియోమీ.. ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే.!
Xiaomi 17T ఇండియా లాంచ్ డేట్ ను షియోమీ ఈరోజు అనౌన్స్ చేసింది
ఈ ఫోన్ ను ప్రీమియం సెగ్మెంట్ లో లాంచ్ చేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు
Leica తో కలిసి నిర్మించిన కెమెరా సిస్టం తో లాంచ్ చేస్తుంది
Xiaomi 17T ఇండియా లాంచ్ డేట్ ను షియోమీ ఈరోజు అనౌన్స్ చేసింది. షియోమీ నెంబర్ సిరీస్ నుంచి ప్రీమియం స్మార్ట్ ఫోన్ లను అందిస్తుంది. రీసెంట్ గా షియోమీ 17 అల్ట్రా ఫోన్ లాంచ్ చేసిన కంపెనీ ఇప్పుడు షియోమీ 17T స్మార్ట్ ఫోన్ ను కూడా లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ ను ప్రీమియం సెగ్మెంట్ లో లాంచ్ చేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను Leica తో కలిసి నిర్మించిన కెమెరా సిస్టం తో లాంచ్ చేస్తుంది.
SurveyXiaomi 17T : లాంచ్ డేట్
షియోమీ 17 టి స్మార్ట్ ఫోన్ ను జూన్ 4వ తేదీన ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు షియోమీ ప్రకటించింది. ఈ ఫోన్ ను అమెజాన్ మరియు కంపెనీ అఫీషియల్ సైట్ ద్వారా టీజింగ్ చేసింది. అయితే, ప్రస్తుతానికి ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మాత్రమే అనౌన్స్ చేసింది. మే 24వ తేదీ నుంచి ఈ ఫోన్ కీలక ఫీచర్స్ ఒకొక్కటిగా రివీల్ చేయనున్నట్లు షియోమీ తెలిపింది.

అయితే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ స్మార్ట్ ఫోన్ రూమర్డ్ ఫీచర్స్ ఇప్పటికే నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. నెట్టింట్లో వచ్చిన రూమర్లు ప్రకారం, ఈ ఫోన్ ఫ్లాగ్ షిప్ కిల్లర్ గా మార్కెట్ లో అడుగు పెట్టే అవకాశం ఉంటుంది.
Xiaomi 17T: రూమార్డ్ ఫీచర్స్
షియోమీ 17 టి స్మార్ట్ ఫోన్ 6.59 ఇంచ్ AMOLED స్క్రీన్ ను గొరిల్లా గ్లాస్ ప్రొటక్షన్ తో కలిగి ఉంటుందని లీక్స్ ఉన్నాయి. ఈ ఫోన్ స్క్రీన్ 1.5K రిజల్యూషన్, 120Hz రిజల్యూషన్ మరియు డాల్బీ విజన్ సపోర్ట్ వంటి ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది. షియోమీ ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 8500 Ultra చిప్ సెట్ తో లాంచ్ చేసే అవకాశం ఉండొచ్చని రూమర్లు ఉన్నాయి. ఈ ఫోన్ లో 12GB LPDDR 5X RAM మరియు ఫాస్ట్ 512GB స్టోరేజ్ వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉండొచ్చని లీక్స్ చెబుతున్నాయి.
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కెమెరా సెటప్ గురించి కూడా రూమర్లు ఉన్నాయి. అదేమిటంటే, ఈ ఫోన్ లో 50MP మెయిన్, 50MP టెలిఫోటో మరియు 12MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుందని రూమర్లు చెబుతున్నాయి. ఈ కంప్లీట్ సెటప్ LEICA మరియు షియోమీ సారధ్యంలో నిర్మించబడిన కెమెరా ఉంటుంది.
Also Read: Soundbar Buying Guide: మీ ఇంటికి తగిన సౌండ్ బార్ ఎలా ఎంచుకోవాలి.!
ప్రస్తుతం మొబైల్ మార్కెట్ లో నడుస్తున్న బిగ్ బ్యాటరీ ట్రెండ్ ఈ ఫోన్ లో ఫాలో చేస్తుందని చెబుతున్నారు. ఈ ఫోన్ లో 6500 mAh భారీ బి బ్యాటరీతో ఈ ఫోన్ లాంచ్ కావచ్చని కొన్ని లీక్స్ ఉన్నాయి. అంతేకాదు, ఈ ఫోన్ 67W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉండొచ్చని కూడా అదే లీక్స్ చెబుతున్నాయి.
అయితే, ఈ ఫోన్ ఫీచర్స్ గురించి కంపెనీ ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేయలేదు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile