Xiaomi 14 Ultra: పవర్ ఫుల్ ఆల్రౌండ్ ఫీచర్స్ తో విడుదలయ్యింది.!

HIGHLIGHTS

షియోమి 14 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ఎట్టకేలకు ఈరోజు విడుదలయ్యింది

Xiaomi 14 Ultra పవర్ ఫుల్ ఆల్రౌండ్ ఫీచర్స్ తో విడుదలయ్యింది

షియోమి 14 అల్ట్రా ఫోన్ లో Leica క్వాడ్ కెమేరా సిస్టం ను అందించింది

Xiaomi 14 Ultra: పవర్ ఫుల్ ఆల్రౌండ్ ఫీచర్స్ తో విడుదలయ్యింది.!

Xiaomi 14 Ultra: షియోమి చాలా కాలంగా టీజింగ్ చేస్తున్న షియోమి 14 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ఎట్టకేలకు ఈరోజు విడుదలయ్యింది. ఈ షియోమి ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ పవర్ ఫుల్ ఆల్రౌండ్ ఫీచర్స్ తో విడుదలయ్యింది. షియోమి ఈ ఫోన్ ను చాలా విలక్షణమైన ఫీచర్స్ మరియు అంతకన్నా విలక్షణమైన డిజైన్ తో విడుదల చేసింది. ఈరోజే ఇండియన్ మార్కెట్ లో అడుగుపెట్టిన షియోమి 14 అల్ట్రా ధర, స్పెక్స్ మరియు ఫీచర్లు ఏమిటో ఒక లుక్కేద్దాం పదండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Xiaomi 14 Ultra: ప్రత్యేకతలు

షియోమి 14 అల్ట్రా స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ లేటెస్ట్ పవర్ ఫుల్ ప్రోసెసర్ Snapdragon 8 Gen 3 తో వచ్చింది. ఈ పవర్ ఫుల్ ప్రోసెసర్ కి జతగా 16 GB LPDDR5X RAM మరియు 512 GB ( UFS 4.0) ఇంటర్నల్ స్టోరేజ్ లను కలిగి వుంది. ఈ ఫోన్ లేటెస్ట్ Xiaomi HyperOS సాఫ్ట్ వేర్ తో Android 14 OS పైన నడుస్తుంది.

ఈ షియోమి ఫ్లాగ్ షిప్ ఫోన్ లో ప్రీమియం ఫీచర్స్ కలిగిన డిస్ప్లేని అందించింది. ఈ ఫోన్ లో 6.73 ఇంచ్ LTPO AMOLED డిస్ప్లేని 1-120Hz అడాప్టివ్ షింక్ ప్రో రిఫ్రెష్ రేట్ తో కలిగి వుంది. ఈ డిస్ప్లే 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, Dolby Vision మరియు HDR10+ సపోర్ట్ లను కలిగి వుంది.

కెమేరా పరంగా, షియోమి 14 అల్ట్రా ఫోన్ లో Leica క్వాడ్ కెమేరా సిస్టం ను అందించింది. ఈ సెటప్ లో 50MP (LYT-900) లైకా మెయిన్ కెమేరా, 50MP Leica 75mm టెలిఫోటో, 50MP లైకా పెరిస్కోప్ మరియు LEICA VARIO-SUMMILUX సెన్సార్లు ఉన్నాయి. ఈ సెటప్ తో పాటుగా గుట్టలు గుట్టలుగా కెమేరా ఫీచర్స్ ను కూడా జత చేసింది.

Also Read: Jio Plans: ప్రముఖ OTT ప్లాట్ ఫామ్స్ సబ్ స్క్రిప్షన్ తో వచ్చే జియో బెస్ట్ ప్లాన్స్.!

ఈ ఫోన్ కెమేరాతో 30fps వద్ద 8K Video లను, 60fps వద్ద 4K Dolby Vision వీడియోలను 120fps వద్ద 4K వీడియోలను షట్ చేయవచ్చు. ఈ ఫోన్ తో 1920fps వద్ద కూడా స్లోమోషన్ వీడియోలను షూట్ చేయవచ్చని కంపెనీ తెలిపింది. ఇక ఫోటోల కోసం Leica ఫీచర్స్ ను ఈ ఫన్ లో జత చేసింది. ఇది స్మార్ట్ ఫోన్ అనడం కన్న ప్రొఫెషనల్ కెమేరా అనొచ్చేమో అనేలా ఈ ఫోన్ ను తీసుకు వచ్చింది షియోమి.

ఈ షియోమీ ప్రీమియం స్మార్ట్ ఫోన్ 5000mAh బిగ్ బ్యాటరీని 90W హైపర్ ఛార్జ్ మరియు 80W వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ తో అందించింది. ఈ ఫోన్ డ్యూయల్ నానో SIM మరియు eSIM సపోర్ట్ తో కూడా వస్తుంది. ఈ ఫోన్ లో Dolby Atmos సపోర్ కూడా వుంది మరియు IP 68 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా కూడా ఉంటుంది.

Xiaomi 14 Ultra: Price

షియోమి 14 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ను కేవలం 16GB + 512GB సింగల్ వేరియంట్ తో విడుదల చేసింది. ఈ ఫోన్ ను రూ. 99,999 ధరతో ఇండియన్ మార్కెట్ లి ప్రవేశపెట్టింది. ICICI, HDFC మరియు Amex బాంక్స్ యొక్క క్రెడిట్ / డెబిట్ మరియు EMI ఆప్షన్ లతో ఈ ఫోన్ ను కొనే వారికి రూ. 5000 డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అంతేకాదు, సెలెక్టెడ్ డివైజెస్ ఎక్స్ చేంజ్ పైన రూ. 5,000 ధనపు డిస్కౌంట్ ఆఫర్ చేస్తుందని కూడా తెలిపింది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo