లీకైన షియోమి అప్ కమింగ్ ఫోన్ స్పెక్..ఒక లుక్కేయండి.!

HIGHLIGHTS

ఇండియాలో షియోమి అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ ఫిక్సయ్యింది

Xiaomi 13 Pro స్మార్ట్ ఫోన్ టీజింగ్ కూడా మొదలుపెట్టింది

ఈ షియోమి అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లీకైన స్పెక్స్ వివరాలు

లీకైన షియోమి అప్ కమింగ్ ఫోన్ స్పెక్..ఒక లుక్కేయండి.!

ఇండియాలో షియోమి అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ ఫిక్సయ్యింది. ఫిబ్రవరి 26న Xiaomi 13 Pro స్మార్ట్ ఫోన్ ను విడుదల చేస్తున్నట్లు కంపెనీ తెలుపడంతో పాటుగా టీజింగ్ కూడా మొదలుపెట్టింది. ఈ అప్ కామింగ్ ఫోన్ కెమేరాలో ప్రముఖ కెమేరా సంస్థ Leica ను భాగస్వామ్యం చేసినట్లు షియోమి వెల్లడించింది. అంతేకాదు, mi.com నుండి ఇప్పటికే అందించిన టీజింగ్ వీడియో ద్వారా Leica కంపెనీతో షియోమి కి ఉన్న అనుబంధాన్ని కూడా గుర్తుకు చేసింది. ఈ షియోమి అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లీకైన స్పెక్స్ వివరాలు ఏమిటో చూద్దామా.           

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Xiaomi 13 Pro: లీక్డ్ మరియు అంచనా స్పెక్స్

Xiaomi 13 Pro ఇప్పటికే చైనా మరియు యూరప్ దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. దీన్ని బేస్ చేసుకొని ఆవే స్పెక్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ షియోమీ ఇండియాలో విడుదల చేయవచ్చని చాలా నివేదికలు చెబుతున్నాయి. ఇదే నిజమైతే, Xiaomi 13 Pro  6.7 ఇంచ్ LTPO కర్వ్డ్ డిస్ప్లేని 2K రిజల్యూషన్ తో కలిగి వుంటుంది. షియోమి 13 ప్రో స్మార్ట్ ఫోన్ Snapdragon 8 Gen 2 పవర్డ్ స్మార్ట్‌ఫోన్. దీనికి జతగా, 12GB వరకు LPDDR5x RAM మరియు 512GB వరకు UFS 4.0 స్టోరేజ్‌తో వస్తుంది. 

Xiaomi 13 Pro వెనుక చదరపు ఆకారపు కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంది. ఇందులో ట్రిపుల్ కెమెరా సిస్టం, డ్యూయల్-LED ఫ్లాష్ మరియు Leica బ్రాండింగ్ కలిగి ఉంటుంది. Xiaomi 13 ఫోన్ 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా మరియు 50-మెగాపిక్సెల్ + 12-మెగాపిక్సెల్ + 10-మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇది 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4820mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo