Xiaomi 13 Pro 5G: ధర స్పెక్స్, ఆఫర్లు మరియు సేల్ వివరాలు తెలుసుకోండి.!

HIGHLIGHTS

Xiaomi 13 Pro 5G గొప్ప ఫీచర్లతో వచ్చింది

మార్చి 6వ తేది మధ్యాహ్నం 12 గంటలకి మొదటిసారిగా సేల్ కి అందుబాటులోకి వస్తుంది

Leica కెమేరా ఫిల్టర్స్ మరియు ఫీచర్స్ తో ఈ ఫోన్ లాంచ్ చెయ్యబడింది

Xiaomi 13 Pro 5G: ధర స్పెక్స్, ఆఫర్లు మరియు సేల్ వివరాలు తెలుసుకోండి.!

షియోమి ఇండియాలో లేటెస్ట్ గా విడుదల చేసిన ప్రీమియం స్మార్ట్ ఫోన్ Xiaomi 13 Pro 5G గొప్ప ఫీచర్లతో వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రముఖ కెమేరా బ్రాండ్ Leica కెమేరా ఫిల్టర్స్ మరియు ఫీచర్స్ తో లాంచ్ చెయ్యబడింది. మార్చి 6వ తేది మధ్యాహ్నం 12 గంటలకి మొదటిసారిగా సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ కొనేముందుగా మీరు తెలుసుకోవాల్సిన ధర స్పెక్స్, ఆఫర్లు మరియు సేల్ వివరాలు ఇక్కడ చూడవచ్చు.   
   
Xiaomi 13 Pro 5G: ధర   

Digit.in Survey
✅ Thank you for completing the survey!

షియోమి 13 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ ను కేవలం 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ సింగల్ వేరియంట్ తో ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను రూ.79,999 రూపాయల ధరతో షియోమి లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ మంచి ఆఫర్లను కూడా కంపెనీ జతచేసింది. 

Xiaomi 13 Pro 5G:ఆఫర్లు

ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మరియు క్రెడిట్ కార్డ్ EMI తో ఈ ఫోన్ కొనేవారికి 10,000 రూపాయల తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మరియు క్రెడిట్ కార్డ్ EMI తో ఈ ఫోన్ కొనేవారికి 8,000 రూపాయల తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. షియోమి/రెడ్ మి ఫోన్ తో ఎక్స్ చేంజ్ అఫర్ ద్వారా ఈ ఫోన్ కొనేవారికి 12,000 ఎక్స్ చేంజ్ బోనస్ లభిస్తుంది. అంతేకాదు, No Cost EMI                

Xiaomi 13 Pro 5G: స్పెక్స్ 

Xiaomi 13 Pro 5G ప్రీమియం స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ యొక్క ఫీచర్లను కూడా షియోమి ప్రీమియం గానే అందించింది. ఈ ఫోన్ 10-bit 6.73-అంగుళాల 2K+ (3200×1440 పిక్సెల్స్) రిజల్యూషన్ E6 AMOLED డిస్ప్లేని కలిగి ఉంది. ఇది Dolby Vision మరియు HDR10+ సపోర్ట్ తో పాటుగా 120Hz రిఫ్రెష్ రేట్‌ మరియు 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తుంది. ఈ ప్రీమియం డిస్ప్లే మరింత పటిష్టంగా ఉంచేలా గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణని ఈ ఫోన్ లో జతచేసింది.

ఈ ఫోన్ లేటెస్ట్ క్వాల్కమ్ ప్రొసెసర్ Snapdragon 8 Gen2 SoC తో పనిచేస్తుంది. అంతేకాదు, ఇది LPDDR5X 12GB RAM మరియు UFS 4.0 256GB స్టోరేజ్ ఎంపికతో జత చేయబడింది. ఈ షియోమి ఫోన్ లేటెస్ట్ MIUI 14 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 13 OS పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ లో OIS తో 50MP (IMX989) కెమెరాకి జతగా 3.2x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50MP టెలిఫోటో కెమెరా మరియు 50MP అల్ట్రా-వైడ్ కెమెరా సెటప్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా ఉంది. ఈ కెమేరా సిస్టం Leica కెమేరా పనితనం తో నిర్మించబడింది. ఈ కెమెరాతో 24fps వద్ద 8K వీడియోలను, 60fps వద్ద 4K వీడియోలను చిత్రీకరించవచ్చు. అలాగే, సెల్ఫీల కోసం  ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ కెమెరాతో HDR 10+ వీడియోలను చిత్రీకరించవచ్చు 

Xiaomi 13 Pro స్మార్ట్ ఫోన్ 4,820mAh బ్యాటరీని భారీ 120W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, 50W ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ మరియు 10W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ తో అందించింది. ఈ ఫోన్ డ్యూయల్ స్టీరియో స్పీకర్‌ లను Dolby Atmos మరియు Hi-Res ఆడియో సర్టిఫికేషన్ తో కూడా కలిగి ఉంది. 

Xiaomi 13 Pro స్మార్ట్ ఫోన్ యొక్క స్పెక్స్ మరియు ఫీచర్లను ముందుగా అందించిన కంపెనీ, ఫిబ్రవరి 28వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ యొక్క ధర వివరాలను ప్రకటించనున్నట్లు తెలిపింది. అంటే, ఈ ఫోన్ ధర వివరాలు రేపు తెలియ చేయబడతాయి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo