Xiaomi 12 Series: భారీ ఫీచర్లతో విడుదలైన షియోమి 12 సిరీస్ స్మార్ట్ ఫోన్లు

Xiaomi 12 Series: భారీ ఫీచర్లతో విడుదలైన షియోమి 12 సిరీస్ స్మార్ట్ ఫోన్లు
HIGHLIGHTS

Xiaomi 12, Xiaomi 12X మరియు Xiaomi 12 Pro లను ఆవిష్కరించింది

షియోమి 12 సిరీస్ స్మార్ట్ ఫోన్లు ఎట్టకేలకు చైనాలో విడుదలయ్యాయి. షియోమి తన 12 Series నుండి Xiaomi 12, Xiaomi 12X మరియు Xiaomi 12 Pro లను చైనా మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ ఫోన్లను భారీ 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 120Hz OLED డిస్ప్లే మరియు మరిన్ని ట్రెండీ ఫీచర్లతో ప్రకటించింది. చైనా మార్కెట్లో సందడి చేస్తున్న ఈ షియోమి లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ విశేషాలను గురించి తెలుసుకుందాం.

Xiaomi 12X : ధర

Xiaomi 12X స్మార్ట్ ఫోన్ ఈ 12 సిరీస్ స్మార్ట్ ఫోన్లలో తక్కువ ధర ఫోన్ గా వచ్చింది. ఈ ఫోన్ ధర RMB 3199 (సుమారు రూ. 37,500) నుండి ప్రారంభమవుతుంది.

Xiaomi 12X : స్పెక్స్

ఈ ఫోన్ 6.28 ఇంచ్ FHD+ డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంటుంది. ఈ డిస్ప్లే HDR10+ మరియు Dolby Vision సపోర్ట్ ని కూడా కలిగి వుంది మరియు గొరిల్లా గ్లాస్ విక్టస్ తో వస్తుంది. షియోమి 12X క్వాల్కమ్ Snapdragon 870 చిప్‌సెట్‌తో శక్తితో పనిచేస్తుంది. ఈ ఫోన్ 12GB RAM మరియు 256GB స్టోరేజ్ తో జత చేయబడింది. ఇది ఆండ్రాయిడ్ 12 ఆధారంగా పనిచేసే MIUI 13 స్కిన్ పైన నడుస్తుంది.

ఇక కెమెరాల పరంగా, ఈ ఫోన్  50MP OIS ప్రైమరీ కెమెరాని, 13MP అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 5MP మాక్రో సెన్సార్ లను కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తుంది. వెనుక కెమెరా 24FPS వద్ద 8K మరియు 60FPS వరకు 4K UHDలో రికార్డ్ చేయగలదు. సెల్ఫీల కోసం ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఉంది.

ఈ ఫోన్‌లో Harman Kardon ట్యూన్ చేసిన స్టీరియో స్పీకర్స్ మరియు ఇన్-స్క్రీన్ ఫింగర్‌ప్రింట్ రీడర్ ఉంది. ఈ ఫోన్ లో 4,500mAh బ్యాటరీని 67W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ మద్దతుతో అందించింది.

Xiaomi 12: ధర

Xiaomi 12 స్టార్టింగ్ వేరియంట్ 8GBర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో RMB 3699 (~రూ. 43,000) ప్రారంభ ధరతో ఉంటుంది.

Xiaomi 12: స్పెక్స్

Xiaomi 12 మరియు Xiaomi 12X రెండు కూడా విధమైన డిస్ప్లే ను కలిగివుంటాయి. అయితే, Xiaomi 12 లేటెస్ట్ క్వాల్కమ్ ప్రొసెసర్ Snapdragon 8 Gen1 SoC తో వస్తుంది. ఇది గరిష్టంగా 12GB RAM మరియు 256GB వరకు స్టోరేజ్ ఎంపికలతో జత చేయబడింది.ఈ ఫోన్ Android 12 ఆధారితంగా రూపొందించబడిన తాజా MIUI 13 పై నడుస్తుంది.

ఆప్టిక్స్ విషయానికి వస్తే, ఇందులో కూడా 50MP ప్రైమరీ కెమెరాని, 13MP అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 5MP మాక్రో సెన్సార్ లను కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వుంది. అయితే, ఈ కెమెరా EIS మరియు OIS సపోర్ట్ కలిగి వుంది మరియు HDR10+తో 30FPS వరకు 4K UHD లో రికార్డ్ చేయగలదు. ఈ ఫోన్ 4,500mAh బ్యాటరీతో వస్తుంది మరియు ఇది 67W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ మరియు 50W ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

Xiaomi 12 Pro: ధర

ఈ సిరీస్ లో ఇది ప్రీమియం వేరియంట్ గా వస్తుంది. ఈ ఫోన్ యొక్క బేసిక్ వేరియంట్ 8GB+128GB లో RMB 4699 (సుమారు రూ. 55,000) ప్రారంభ ధరతో ఉంటుంది.

Xiaomi 12 Pro: స్పెక్స్

 షియోమి 12 సిరీస్ లో ఇది ప్రీమియం స్మార్ట్ ఫోన్ మరియు దీని ధర మాత్రమే కాదు ఫీచర్లను కూడా ప్రీమియం గానే అందించింది. ఈ ఫోన్ 10-bit 6.73-అంగుళాల QHD+ (3200×1080 పిక్సెల్స్) రిజల్యూషన్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది Dolby Vision మరియు HDR10+ సపోర్ట్ తో పాటుగా 120Hz రిఫ్రెష్ రేట్‌కు కూడా మద్దతు ఇస్తుంది. డిస్ప్లే మరింత పటిష్టంగా ఉంచేలా గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణతో ఈ డిస్ప్లే ని అందించింది.

ఈ ఫోన్ కూడా 12 మాదిరిగా, లేటెస్ట్ క్వాల్కమ్ ప్రొసెసర్ Snapdragon 8 Gen1 SoC తో వస్తుంది. అలాగే, ఈ ఫోన్ 12GB RAM మరియు 256GB వరకు స్టోరేజ్ ఎంపికతో జత చేయబడింది మరియు MIUI 13పై నడుస్తుంది. ఈ ఫోన్ లో OISతో 50MP కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 2x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50MP టెలిఫోటో కెమెరాలు కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా ఉంది. అలాగే, సెల్ఫీల కోసం  ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఉంది.

Xiaomi 12 Pro స్టీరియో స్పీకర్‌ లను కూడా కలిగి ఉంది మరియు 4,600mAh బ్యాటరీని భారీ 120W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ మరియు 50W ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్ట్ తో ఈ ఫోన్ లో అందించింది.  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo