Xiaomi 12 Pro స్మార్ట్ ఫోన్ ఈరోజు అమెజాన్ నుండి భారీ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. భారీ 50MP ట్రిపుల్ కెమేరా సెట్టింగ్, 2K+ Dolby Vision సపోర్ట్ కలిగిన AMOLED డిస్ప్లే మరియు 120W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి భారీ ఫీచర్లతో వచ్చిన ఈ షియోమి ప్రీమియం స్మార్ట్ ఫోన్ ఈరోజు అమెజాన్ మంచి డిస్కౌంట్ తో తక్కువ ధరలో లభిస్తోంది. మరి ఈ స్మార్ట్ ఫోన్ డీల్ ఏమిటో చూద్దామా.
Survey
✅ Thank you for completing the survey!
Xiaomi 12 Pro: ధర మరియు ఆఫర్లు
షియోమీ 12 ప్రో యొక్క బేసిక్ వేరియంట్ 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో రూ. 62,000 ధరతో లాంచ్ చెయ్యబడింది. అయితే, ఈరోజు అమెజాన్ నుండి 10,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో రూ.52,999 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ ను HDFC బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారు ఫ్లాట్ 3,000 డిస్కౌంట్ ను పొందవచ్చు. అంటే,ఈ ఆఫర్ల ద్వారా మీరు ఈ ఫోన్ ను రూ.13,000 డిస్కౌంట్ ధరకే మీ సొంతం చేసుకోవచ్చు. Buy From Here
షియోమి 12 ప్రో ఒక ప్రీమియం స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ యొక్క ఫీచర్లను కూడా ప్రీమియం గానే అందించింది. ఈ ఫోన్ 10-bit 6.73-అంగుళాల 2K+ (3200×1440 పిక్సెల్స్) రిజల్యూషన్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది Dolby Vision మరియు HDR10+ సపోర్ట్ తో పాటుగా 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 480Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తుంది. ఈ ప్రీమియం డిస్ప్లే మరింత పటిష్టంగా ఉంచేలా గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణతో ఈ డిస్ప్లే ని అందించింది.
ఈ ఫోన్ లేటెస్ట్ క్వాల్కమ్ ప్రొసెసర్ Snapdragon 8 Gen1 SoC తో వస్తుంది. అలాగే, ఈ ఫోన్ LPDDR5 12GB RAM మరియు UFS 3.1 256GB వరకు స్టోరేజ్ ఎంపికతో జత చేయబడింది మరియు MIUI 13 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 12 OS పైన నడుస్తుంది. ఈ ఫోన్ లో OIS తో 50MP (IMX707) కెమెరా జతగా 50MP అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 2x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50MP టెలిఫోటో కెమెరాలు కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా ఉంది. ఈ కెమెరాతో 24fps వద్ద 8K వీడియోలను, 60fps వద్ద 8K వీడియోలను చిత్రీకరించవచ్చు. అలాగే, సెల్ఫీల కోసం ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ కెమెరాతో HDR 10+ వీడియోలను చిత్రీకరించవచ్చు
Xiaomi 12 Pro స్టీరియో స్పీకర్ లను కూడా కలిగి ఉంది మరియు 4,600mAh బ్యాటరీని భారీ 120W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ మరియు 50W ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఈ ఫోన్ లో అందించింది. అంతేకాదు, 10W రివర్స్ వైర్ లెస్ ఛార్జింగ్ కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ కౌటర్ బ్లూ, నోయిర్ బ్లాక్ మరియు ఒపేరా మౌవే అనే మూడు విలక్షణమైన కలర్ అప్షన్ లలో లభిస్తుంది.