Xiaomi 11i 5G స్మార్ట్ ఫోన్స్ లాంచ్: ఇండియాలో విడుదలైన షియామి కొత్త ఫోన్లు

HIGHLIGHTS

Xiaomi 11i సిరీస్ ను ఈరోజు ఇండియాలో లాంచ్ చేసిన షియోమి

120W హైపర్ ఛార్జ్ అత్యంత వేగవంతమైన ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్

ఆకర్షణీయమైన ఫీచర్లతో ఈ స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది

Xiaomi 11i 5G స్మార్ట్ ఫోన్స్ లాంచ్: ఇండియాలో విడుదలైన షియామి కొత్త ఫోన్లు

షియోమి తన Xiaomi 11i సిరీస్ నుండి ఈరోజు ఇండియాలో తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్స్ విడుదల చేసింది. ఈ సిరీస్ నుండి Xiaomi 11i 5G  మరియు Xiaomi 11i Hyper Charge 5G రెండు ఫోన్లను ఆవిష్కరించింది. వీటిలో, షియామి 11i హైపర్ ఛార్జ్ స్మార్ట్ ఫోన్ 120W హైపర్ ఛార్జ్ టెక్నాలజీతో అత్యంత వేగవంతమైన ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అలాగే, 120Hz రిఫ్రెష్ రేట్ AMOLED డిస్ప్లే వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లతో ఈ స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Xiaomi 11i 5G మరియు 11i Hyper Charge 5G : ధర

షియోమి 11i 5G స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ 6GB RAM /128GB స్టోరేజ్‌తో రూ.24,999 ప్రారంభ ధరతో లాంచ్ చేయబడింది. 8GB RAM /128GB స్టోరేజ్‌వేరియంట్ ధర రూ.26,999. అలాగే షియోమి 11i హైపర్ ఛార్జ్ 5G స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ 6GB RAM /128GB స్టోరేజ్‌తో రూ.26,999 ప్రారంభ ధరతో లాంచ్ చేయబడింది. 8GB RAM /128GB స్టోరేజ్‌వేరియంట్ ధర రూ.28,999. ఈ స్మార్ట్ ఫోన్స్ జనవరి 12 నుండి Flipkart, Mi స్టోర్ యాప్ మరియు మరిన్నింటిలో అందుబాటులో ఉంటుంది.

Xiaomi 11i 5G మరియు 11i Hyper Charge 5G : స్పెక్స్

ఈ రెండు స్మార్ట్ ఫోన్లు కూడా IP53 రేటింగ్ కలిగిన గ్లాస్ బాడీని కలిగి ఉంటాయి. ఈ రుండు ఫోన్లు కూడా 6.67 ఇంచ్ FHD+ AMOLED డిస్ప్లే ని కలిగివుంటాయి. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 360Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో పాటుగా 1200 నిట్స్ గరిష్ఠ బ్రెట్నెస్ అందిస్తుంది. ఈ రెండు ఫోన్లు కూడా మీడియాటెక్ లేటెస్ట్ 5G 6nm ప్రోసెసర్ Dimensity 920 ఆక్టా కోర్ ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా 8జిబి ర్యం మరియు 128జిబి స్టోరేజ్ లను కలిగివుంది.

కెమెరా సెట్టింగ్స్ గురించి చూస్తే, ఈ రెండు ఫోన్లు కూడా వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉంటాయి. ఇందులో, 108MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 2MP మాక్రో కెమెరాలను జతగా కలిగి ఉంటుంది. ఈ కెమెరాలు 4K UHD లో వీడియోలను 30fps వరకూ రికార్డ్ చేయగలవని కంపెనీ చెబుతోంది. సెల్ఫీల కోసం 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది.

ఇక ఈ రెండు ఫోన్లలో గమనించదగిన వ్యత్యాసం బ్యాటరీ ఫీచర్. Xiaomi 11i 5G ఫోన్ 67W టర్బో ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,160mAh బ్యాటరీతో వస్తే, 11i Hyper Charge 5G మాత్రం 120W హైపర్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 4,500mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే, షియోమి ఈ రెండు ఫోన్లకు తగిన ఫాస్ట్ చార్జర్లను బాక్స్ తోపాటుగా అందిస్తుంది.

ఇక అదనపు ఫీచర్ల విషయానికి వస్తే, ఈ రెండు ఫోన్లు కూడా డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లు మరియు Dolby Atmos సర్టిఫికేషన్ మరియు Hi-Res ఆడియో ప్లేబ్యాక్ సపోర్ట్‌తో వస్తాయి.   

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile