ప్రపంచంలో మొట్టమొదటి 18GB ర్యామ్ ఫోన్ వచ్చేసింది

ప్రపంచంలో మొట్టమొదటి 18GB ర్యామ్ ఫోన్ వచ్చేసింది
HIGHLIGHTS

భారీ 18జీబీ ర్యామ్ తో వచ్చిన స్మార్ట్ ఫోన్

మొట్టమొదటి 18జీబీ ర్యామ్ స్మార్ట్ ఫోన్

స్మార్ట్ ఫోన్ వచ్చినప్పటి నుండి చాలా గ్యాడ్జెట్స్ కూడా మూలన పడ్డాయి. అయితే, కొత్తగా వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ గురించి తెలిస్తే, ల్యాప్ టాప్స్ పనికూడా అయిపోతుందా? అని డౌట్ వస్తుంది. ఎందుకంటే, Red Magic 6 సిరీస్ నుండి వచ్చిన హై ఎండ్ స్మార్ట్ ఫోన్ Pro ఏకంగా 18GB ర్యామ్ తో వచ్చింది. ఈ ఫోన్ కేవలం ర్యామ్ మాత్రమే కాకుండా వేగవంతమైన ప్రాసెసర్ హై రిఫ్రెష్ రేట్ డిస్ప్లే మరియు మరిన్ని భారీ ఫీచర్లతో వచ్చింది. ఈ ఫోన్ చైనాలో లాంచ్ అయ్యింది.

రెడ్ మ్యాజిక్ 6 ప్రో స్పెషిఫికేషన్స్

ఈ ఫోన్ పెద్ద 6.8 అంగుళాల FHD+ డిస్ప్లే తో వస్తుంది.  రెడ్ మ్యాజిక్ 6 ప్రో వేగవంతమైన క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 888 చిప్ సెట్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా, అతిపెద్ద 18GB ర్యామ్ మరియు 512GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా వుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో 64MP ట్రిపుల్ కెమెరా ఇవ్వబడింది. ఈ ఫోన్ ఎటువంటి నోచ్ లేకుండా పాప్ అప్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది.

ఈ ఫోన్ లో కేవలం 4500 mAh బ్యాటరీని ఇచ్చినా ఛార్జింగ్ సపోర్ట్ మాత్రం అతిభారీ గానే ఇచ్చింది. ఎందుకంటే, ఈ ఫోన్ ఏకంగా 120W ఛార్జింగ్ సపోర్ట్ తో పీక్స్ లో వుంది. అంతేకాదు, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు మరిన్ని హై ఎండ్ ఫీచర్లతో చైనాలో CNY 6,599 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చెయ్యబడింది. ఈ మొత్తాన్ని ఇండియన్ రూపాయి లోకి కన్వర్ట్ చేసే చూస్తే, 74,200 రూపాయలకు రమారమి ఉంటుంది.               

ఇమేజ్: ఫాంటసీ ఇమేజ్                     

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo