తెలుగు రాష్ట్రాల్లో BSNL యొక్క ఈ 7 ప్రీపెయిడ్ ప్లాన్లతో 2.21GB డేటా అదనంగా అందుకోండి

HIGHLIGHTS

28 రోజల వ్యాలిడిటీ మొదలుకుని ఒక సమ్వత్సరం వరకు వున్నా ఈ 7 ప్రీపెయిడ్ ప్లాన్ల పైన ఈ అఫర్ అందుబాటులోవుంది.

తెలుగు రాష్ట్రాల్లో BSNL యొక్క ఈ 7 ప్రీపెయిడ్ ప్లాన్లతో 2.21GB డేటా అదనంగా అందుకోండి

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL), తన 7 ప్రీపెయిడ్ ప్రణాళికల పైన రోజువారీ 2.21GB డేటాని అందిస్తోంది.  BSNL యొక్క ప్రీపెయిడ్ ప్రణాళికలైనటువంటి, Rs 186, Rs 429,Rs 485,Rs 666, Rs 999, మరియు వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్స్ అయినటువంటి Rs 1699 మరియు Rs 2099 పైన కూడా ఈ 2.21GB రోజువారీ అధిక డేటాని వర్తింపచేసింది.  ముఖ్యంగా, BSNL యొక్క వార్షిక ప్రణాళికలైన Rs. 1699 మరియు 2099 లకి కూడా ఈ రోజువారీ 2.21GB ని ముందు నుండే వర్తింపు చేసింది. ముణుడుగా నవంబరు 14 వ తేదీతో ఈ ప్రణాళికలు ముగుస్తుందని ప్రకటించినా, వీటిపైన వినియోగదారుల స్పందన అనుసరించి, ఈ వార్షిక ప్రణాళికలను జనవరి 2019 వరకు అందుబాటులో ఉంచింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

1. Rs 186 ప్లాన్ ప్రయోజనాలు – అపరిమిత కాలింగ్, రోజువారీ 3.21GB మరియు అన్లిమిటెడ్ SMS(100/రోజుకి) 28 రోజుల వ్యాలిడిటీ.     

2. Rs 429 ప్లాన్ ప్రయోజనాలు – అపరిమిత కాలింగ్, రోజువారీ 3.21GB మరియు అన్లిమిటెడ్ SMS(100/రోజుకి) 81 రోజుల వ్యాలిడిటీ.  

3. Rs 485 ప్లాన్ ప్రయోజనాలు – అపరిమిత కాలింగ్, రోజువారీ 3.71GB మరియు అన్లిమిటెడ్ SMS(100/రోజుకి) 28 రోజుల వ్యాలిడిటీ. అయితే, ముందుగా రోజువారీ 1.5GB దాటని అందిస్తున్న ఈ ప్రీపెయిడ్ ప్లాన్ను కూడా ఈ అదనపు డేటా ప్రయోజన జాబితాలోకి తీసుకొచ్చింది BSNL.

4. Rs 666 ప్లాన్ ప్రయోజనాలు – అపరిమిత కాలింగ్, రోజువారీ 3.21GB మరియు అన్లిమిటెడ్ SMS(100/రోజుకి) 129 రోజుల వ్యాలిడిటీ.     

5. Rs 999 ప్లాన్ ప్రయోజనాలు – అపరిమిత కాలింగ్, రోజువారీ 3.21GB మరియు అన్లిమిటెడ్ SMS(100/రోజుకి) 181 రోజుల వ్యాలిడిటీ. 

ఇక వార్షిక ప్లాన్ల విషయానికి వస్తే,                      

Rs 1699 ప్రీపెయిడ్ ప్లాన్

BSNL యొక్క వార్షిక Rs.1699 ప్లాన్ తో, లోకల్ మరియు STD అపరిమిత కాలింగ్, రోజువారీ 100SMS లు మరియు రోజువారీ 2GB డాటాతో మొత్తంగా 730GB డేటాని 365 రోజుల చెల్లుబాటుతో అందిస్తోంది. ఈ ప్లాన్ యొక్క FUP పరిమితిని దాటిన తరువాత దీని స్పీడ్ 80Kbps కి తగ్గించబడుతుంది. అయితే, ప్రస్తుత ప్రకటనతో దీని యొక్క రోజువారి డేటా 2GB నుండి 4.21GB కి చేరుకుంది. అంటే, ఈ ప్లాను ద్వారా ఇపుడు రోజువారీ 4.21GB డేటాని వాడుకోవచ్చు.             

Rs 2099 ప్రీపెయిడ్ ప్లాన్

మరొక Rs. 2099  వార్షిక ప్రీపెయిడ్ ప్రణాళికతో,  లోకల్ మరియు STD అపరిమిత కాలింగ్, డైలీ 100SMS పరిమితి మరియు రోజువారీ 4GB డాటాతో మొత్తంగా 1460GB డేటాని 365 రోజుల చెల్లుబాటుతో అందిస్తోంది. దీని యొక్క FUP పరిమితి దాటిన తరువాత దీని స్పీడ్ 80Kbps కి తగ్గించబడుతుంది. అయితే, ఇప్పుడు దీనితో పాటు కూడా రోజువారీ 2.2GB అధిక డేటా అందుకుంటుంది. అంటే, దీని యొక్క రోజువారీ డేటా 4GB నుండి 6.21GB కి పెరుగుతుంది.     

ఈ ప్రీపెయిడ్ ప్లానులన్నింటికీ కూడా ఈ అఫర్, 31 జనవరి 2019 వరకు అందుబాటులో ఉంటుంది.                 

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo