హువావే Y9 ప్రైమ్ (2019) ప్రీ-బుకింగ్ చేసేవారికి రూ. 4598 విలువగల యాక్ససరీస్ ఉచితం

హువావే Y9 ప్రైమ్ (2019) ప్రీ-బుకింగ్ చేసేవారికి రూ. 4598 విలువగల యాక్ససరీస్ ఉచితం
HIGHLIGHTS

Huawei స్పోర్ట్స్ BT హెడ్ ఫోన్ మరియు 15,600mAh పవర్ బ్యాంక్ వంటివి ఉచితంగా పొందే అవకాశం అందిస్తోంది.

హువావే సంస్థ నుండి వచినటువంటి మొట్టమొదటి పాప్ అప్ సెల్ఫీ కెమేరా స్మార్ట్ ఫోన్ అయినటువంటి, హువావే Y9 ప్రైమ్ (2019) యొక్క ప్రీ-బుకింగ్స్ ఇప్పుడు మొదలయ్యాయి. అయితే, ఈ ప్రీ-బుకింగ్ కేవలం Croma, Poorvi వంటి పెద్ద పెద్ద ఆఫ్ లైన్ స్టోర్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ను

ఈ ఆఫ్ లైన్ స్టోర్ల ద్వారా ప్రీ బుకింగ్ చేసుకున్నవారికి, Huawei స్పోర్ట్స్ BT హెడ్ ఫోన్ మరియు 15,600mAh పవర్ బ్యాంక్ వంటివి ఉచితంగా పొందే అవకాశం అందిస్తోంది. అలాగే, ఈ ఫోన్ యొక్క మొదటి సేల్ రేపు మధ్యాహ్నం 12 గంటలకి అమేజాన్ ఇండియా ద్వారా జరగనుంది. మిగిలిన ఆఫ్ లైన్ స్టోర్లలో మాత్రం ఆగష్టు 8 వ తేదీ నుండి అందుబాటులో ఉండనుంది.

హువావే Y9 ప్రైమ్ (2019) ధర మరియు ఆఫర్లు

1. హువావే Y9 ప్రైమ్ (2019) (4GB +128GB) – Rs.15,990

ఈ స్మార్ట్ ఫోన్ను కొనుగోలు చేసే జియో వినియోగదారులకు 2.2TB ఉచిత డేటా మరియు 2,200 రూపాయల క్యాష్ బ్యాక్ వంటివి అందిస్తుంది.అలాగే, SBI క్రెడిట్ కార్డు ద్వారా ఈ ఫోన్ను కొనేవారు 10% తక్షణ డిస్కౌంట్ ని అందుకోవచ్చు.

హువావే Y9 ప్రైమ్  ప్రత్యేకతలు

స్పెసిఫికేషన్ల గురించి మాట్లాడితే, ఈ వై 9 ప్రైమ్ (2019) ఒక 6.59 అంగుళాల Full HD + డిస్ప్లేను కలిగి ఉంటుంది  మరియు ఇది TFT ఎల్‌సిడి(LTPS)  ప్యానెల్ తో ఉంటుంది.  దీని స్క్రీన్-టు-బాడీ నిష్పత్తి కూడా 91 శాతం ఉంటుంది మరియు 2340×1080 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందిస్తుంది. కొత్త ట్రెండ్ అయిన పాప్-అప్ కెమెరాని ఇందులో అందించింది. కాబట్టి, పూర్తి వ్యూ  డిస్ప్లే ఇందులో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ హై సిలికాన్ కిరిన్ 710 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఇది 4 జిబి ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్‌తో జత చేయబడుతుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 9 ఫై ఆధారితమైన EMUI 9.0 తో నడుస్తుంది.   

 ఆప్టిక్స్ పరంగా, ఈ ఫోన్ వెనుక భాగంలో 16 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాకి జతగా ఒక 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమేరా మరియు మరొక 2 MP డెప్త్ కెమెరా కలగలిపిన ఒక ట్రిపుల్ రియర్ కెమెరా సేటప్పుతో వస్తుంది. అలాగే, ముందుభాగంలో సెల్ఫీ కోసం 16 MP సెల్ఫీ కెమెరాను కూడా ఇందులో ఇచ్చారు. ఇక ఈ కెమెరా అనుభవాన్ని మెరుగుపరచడానికి AI కూడా దీనికి చేర్చబడింది. దీని ద్వారా చాల రకాలైన 22 రకాలైన కేటగిరీలు మరియు 5000 కంటే పైచిలుకు సీన్లను అదేసమయంలో అనలైజ్ చేస్తుంది. ఇక ఈ పూర్తి ప్యాకేజీకి శక్తిని అందించానికి ఒక పెద్ద 4,000 mAh బ్యాటరీని వేగవంతమైన చార్జరును టైప్ -C తో అందించారు.     

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo