20X జూమ్ కెమేరాతో Realme 6 Pro స్మార్ట్ ఫోన్ లాంచ్ కన్ఫర్మ్

20X జూమ్ కెమేరాతో Realme 6 Pro స్మార్ట్ ఫోన్ లాంచ్ కన్ఫర్మ్

రియల్మీ నుని మరొక కొత్త సిరీస్ ఇండియాలో విడుదలవ్వడానికి సిద్ధమౌతోంది, అదే Realme 6 సిరీస్. అయితే, ఈ ఫోన్ యొక్క కొత్త టీజింగ్ నిజంగా మైమరిపిస్తోంది. ఎందుకంటే, దీని కెమేరాల పైన వస్తున్న రుమర్లను నిజం చేస్తూ, ఈ టీజర్ విడుదలయ్యింది. ఇందులో, ఒక 64MP ప్రధాన కెమేరాని ఇస్తున్నట్లు ముందుగా ప్రకటించగా, చైనా టిప్స్టర్ ఇందులో 20X జూమ్ కెమేరాని మరియు మరిన్ని గొప్ప ఫీచర్లను ఇవ్వనుఅంట్లు ముందుగానే ప్రకటించారు. అయితే, ఇప్పుడు Flipkart ద్వారా రియల్మీ చేస్తున్న టీజింగ్ ఈ విషయాన్ని అధికారికంగా చూపిస్తున్నాయి.

ఈ ప్రో వేరియంట్ రియల్మీ X 50 ప్రో మాదిరిగా మంచి డిజైన్ తో రానున్నట్లు తెలుస్తోంది. అలాగే, దీనిలో వెనుక నిలువుగా అమర్చిన కలుగు కెమేరాల సెటప్ మరియు ముందు డ్యూయల్ సెల్ఫీ కెమేరాలు కూడా ఉన్నట్లు చూపిస్తోంది. ముఖ్యంగా, ఈ ఫోనులో వెనుక ఎటువంటి ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేకపోవడంతో, ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదా సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే, రెండర్ ఫోటోను క్షుణ్ణంగా పరిశీలిస్తే, సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ ఇచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.     

ఇక ఇందులో ఇవ్వనున్న డిస్ప్లే గురించి కూడా వివరించింది. ఈ ప్రో వేరియంట్ FHD+ రిజల్యూషన్ అందించగల డిస్ప్లేని ఒక 90Hz రిఫ్రెష్ రేటుతో పాటుగా ఇవ్వనున్నట్లు చెబుతోంది. ఇక కెమేరాల విషయానికి వస్తే, వెనుక లోక ప్రధాన 64MP ప్రో కెమెరా గల క్వాడ్ కెమేరా సెటప్ తో అందించనుంది. అధనంగా, ఈ కెమేరా సెటప్పుతో 20X జూమ్ ఫీచర్ ని కూడా కలిగి ఉన్నట్లు ప్రకటిస్తోంది. ఇది  30W ఫ్లాష్ చార్జర్ వంటి గొప్ప ఫీచర్లతో రావచ్చని ఈ లీకైన రెండర్ల ద్వారా అంచనా వేస్తున్నారు.  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo