కేవలం 10,000 రూపాయల ధరలో కొనగల పంచ్ హోల్ స్మార్ట్ ఫోన్లు

కేవలం 10,000 రూపాయల ధరలో కొనగల పంచ్ హోల్ స్మార్ట్ ఫోన్లు
HIGHLIGHTS

కేవలం రూ.10,000 కంటే తక్కువ ధరలోనే ఒక పంచ్ హోల్ స్మార్ట్ ఫోన్ను మనం కొనవచ్చు.

ముందుగా, మిడ్ రేంజ్ వివరంగా చెప్పాలంటే, 20,000 రూపాయల ధరలో మాత్రమే లభించిన పంచ్ హోల్ స్మార్ట్ ఫోన్లను మనం చూశాం. కానీ, అటువంటి స్మార్ట్ ఫోన్లను కొనడానికి మన బడ్జెట్  సరిపోయేది కాదు. అయితే, అటువంటి ఇబ్బంది ఇప్పుడు లేదు. ఎందుకంటే, ఇప్పుడు కేవలం రూ.10,000 కంటే తక్కువ ధరలోనే ఒక పంచ్ హోల్ స్మార్ట్ ఫోన్ను మనం కొనవచ్చు. ఈ  ఫోన్ల గురించి ఇప్పుడు చూద్దాం.

1. Infinix S5 : భారతదేశంలో కేవలం రూ.8,999 ధరతో  Infinix S5 ఇండియా మార్కెట్లోకి వచ్చింది. 

2. TECNO CAMON 12 air :  భారతదేశంలో కేవలం రూ .9,999 ధరతో మరియు ఆఫ్‌ లైన్ రిటైల్ దుకాణాల ద్వారా కొనుగోలు చేయవచ్చు.

1. Infinix S5 ప్రత్యేకతలు

ఈ Infinix S5 స్మార్ట్ ఫోన్  ఒక 6.6 అంగుళాల HD+ IPS పంచ్ హోల్ డిజైనుతో మరియు 720X1520 p రిజల్యూషనుతో వస్తుంది మరియు .ఇది 480 నిట్స్ బ్రైట్నెస్ తో వస్తుంది. అంతేకాదు , ఇది ఒక 20:9 ఆస్పెక్ట్ రేషియోని కలిగిన పెద్ద స్క్ర్రీనుతో వస్తుంది.  ఇక ఇందులో చాలా గొప్ప 3D యూనిబాడి డిజనుని కూడా అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 9 ఫై మీద ఆధారితంగా XOS 5.5 చీతా తో ప్రారంభించింది మరియు ఈ పూర్తి డివైజ్ మొత్తానికి పవర్ అందించాడని ఒక పెద్ద 4,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ 2.0Ghz వరకూ క్లాక్ అందించగల ఒక Helio P22 Octa-core 64-bit ప్రాసెసరుతో వస్తుంది. దీనికి జతగా, 4GB ర్యామ్ మరియు 64GB అంతర్గత స్టోరేజ్ అనుసంధానంతో వస్తుంది.అధనంగా 256GB స్టోరేజిని ఒక మెమొరీ కార్డు ద్వారా పెంచుకోవచ్చు మరియు డ్యూయల్ VoLTE కి అపార్ట్ చేస్తుంది.

ఈ  Infinix S5 కెమేరాల గురించి  మాట్లాడితే,  వెనుకభాగంలో  ఒక ప్రధాన 16 మెగాపిక్సెల్ (f1.8) కెమేరాకి జతగా ఒక 5MP వైడ్ యాంగిల్ లెన్స్ తో పాటుగా మరొక 2MP డెప్త్ సెన్సార్ మరియు ఒక మ్యాక్రో లెన్స్ తో జతగా కలిపిన ఒక  క్వాడ్ రియర్ కెమేరాని ఇందులో అందించారు. ఆటో సీన్ డిటెక్షన్, AI పోర్ట్రైట్, AI HDR, AI బ్యూటీ, AI Bokeh మరియు నైట్ షాట్స్ వంటి ఫీచర్లతో వస్తుంది. ముందుభాగంలో సెల్ఫీల కోసం  ఒక 32-MP AI కెమెరాని  కలిగి ఉంది, దీని ఎపర్చరు f2.0 గా ఉంటుంది.

అధనపు ఫీచర్ల విషయానికి వస్తే, డివైజ్ కనెక్టివిటీ, 3.5mm ఆడియో జాక్, FM , OTG, ట్రిపుల్ సిమ్ స్లాట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఫింగర్ ప్రింట్ మరియు ఫేస్ అన్లాక్ ఫీచరుతో కూడా వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్నుక్వజల్ షాన్ మరియు కాస్మిక్ పర్పల్ వంటి కలర్ ఎంపికల్లో కొనుగోలు చేయవచ్చు.

2. TECNO CAMON 12 air : ప్రత్యేకతలు

డ్యూయల్-సిమ్ టెక్నో కెమోన్ 12 ఎయిర్ ఆండ్రాయిడ్ 9 ఆధారంగా HiOS 5.5 పై పనిచేస్తుంది మరియు ఈ ఫోన్ ఒక 6.55-అంగుళాల HD + డిస్‌ప్లేను కలిగి ఉంది, ఇది 720×1600 పిక్సెల్‌ల రిజల్యూషన్ మరియు 20: 9 యాస్పెక్ట్ రేషియోతో ఉంటుంది. ఈ కొత్త మొబైల్ ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో P 22 SoC చేత శక్తిని కలిగి ఉంది మరియు ఇది 4GB RAM తో జత చేయబడింది.

టెక్నో కెమోన్ 12 ఎయిర్ ట్రిపుల్ కెమెరాతో లాంచ్ చేయబడింది మరియు ఫోన్ 16 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను f / 1.8 ఎపర్చరుతో కలిగి ఉంది, మరియు రెండవ కెమెరా 2 మెగాపిక్సెల్ సెన్సార్, ఇది 2.5 సెం.మీ మాక్రో షాట్లు తీసుకోవచ్చు మరియు మూడవ కెమెరా 5 మెగాపిక్సెల్ 120 డిగ్రీల వైడ్ యాంగిల్ లెన్స్. కెమెరా సెటప్‌తో టెక్నో క్వాడ్-ఎల్‌ఈడీ మాడ్యూల్‌ను కూడా జోడించింది. ఈ ఫోన్ ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించబడింది మరియు ఈ కెమెరా 81 డిగ్రీల వైడ్ యాంగిల్ షాట్స్ తీసుకోగలదు.

టెక్నో కే మోన్ 12 ఎయిర్ 64 జిబి ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌ను కలిగి ఉంది, ఇది మైక్రో ఎస్‌డి కార్డ్ ద్వారా 256 జిబి వరకు పెంచుకోవచ్చు. ఇవి కాకుండా, 4G VoLTE, Wi-Fi 802.11 b / g / n, బ్లూటూత్ v5.0, మరియు GPS / A-GPS కనెక్టివిటీ కోసం ఫోన్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ పరికరం వెనుక భాగంలో యాంటీ ఆయిల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంచబడింది, దీని గురించి చుస్తే, ఈ పరికరం 0.27 సెకన్లలో పరికరాన్ని అన్‌లాక్ చేయగలదని మరియు ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఫోన్‌లో చేర్చబడిందని కంపెనీ తెలిపింది. ఫోన్‌లో 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.                  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo