48MP ట్రిపుల్ కెమెరా గల వివో Z1x మొదటి ఫ్లాష్ రేపు జరగనుంది.

48MP ట్రిపుల్ కెమెరా గల వివో Z1x మొదటి ఫ్లాష్ రేపు జరగనుంది.
HIGHLIGHTS

గేమింగ్ మరియు మల్టి టాస్కింగ్ కోసం ప్రత్యేకంగా మల్టి టర్బోలను అందించారు.

VIVO తన Z సిరీస్ నుండి ముందుగా Z1 ప్రో స్మార్ట్ ఫోన్ను తీసుకురాగా, ఇప్పుడు దానికి తరువాతి తరం ఫోనుగా Z1x ను గొప్ప ట్రెండీ ఫీచర్లు మరియు ప్రీమియం లుక్స్ తో ఇండియాలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఒక ట్రిపుల్ కెమేరా మరియు ముందు వాటర్ డ్రాప్ డిజైనులో ఒక 32MP సెల్ఫీ కెమేరాతో వస్తుంది. ముఖ్యంగా ఇది ట్రిపుల్ రియర్ కెమేరాతో పాటుగా సూపర్ AMOLED FHD+ డిస్ప్లేతో మంచి వైవిధ్యమైన రంగులను అందిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ రేపు మధ్యాహ్నం 12 గంటలకి ఫ్లిప్ కార్ట్  నుండి జరగనుంది.

వివో Z1x ధర

1.  6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ – Rs.16,990/-

2.  6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ – Rs.18,990/-

వివో Z1x ధర  ఫీచర్లు మరియు ప్రత్యేకతలు

ఈ వివో Z1x మొబైల్ ఫోన్, ఒక 6.38-అంగుళాల FHD + స్క్రీన్‌ తో వస్తుంది. ఇది సూపర్ AMOLED డిస్ప్లే మరియు ఒక వాటర్‌డ్రాప్ నోచ్ తో వస్తుంది. ఈ మొబైల్ ఫోన్‌ లో, ఎగవంతమైనటువంటి ఒక స్నాప్ డ్రాగన్ 712 AIE ఆక్టా కోర్ ప్రాసెసర్ ని అందించింది. అదనంగా, ఇది 6GB RAM తో అనుసంధానం చెయ్యబడింది మరియు ఇది 64GB /128GB అంతర్గత స్టోరేజితో వస్తుంది. ఈ ఫోన్‌లో 4,500 mAh సామర్థ్యం గల పెద్ద బ్యాటరీ మరియు గరిష్టంగా 22.5 వాట్స్ వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది. ఇందులో, గేమింగ్ మరియు మల్టి టాస్కింగ్ కోసం ప్రత్యేకంగా మల్టి టర్బోలను అందించారు. 

ఇక ఫోటోగ్రఫీ విషయానికి వస్తే, ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందుతుంది. ఒక 48MP ప్రాధమిక సెన్సార్‌కి జతగా మరొక 8MP వైడ్ యాంగిల్ కెమెరా మరియు ఒక  2MP డెప్త్ సెన్సార్ కూడా లభిస్తుంది. ఇది కాకుండా, మీకు ఈ ఫోన్‌లో ఒక 32 MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీల కోసం అందించబడింది. ఈ ఫోన్, ఫన్ టచ్ OS స్కిన్ పైన ఆండ్రాయిడ్ 9 ఫై ఆధారితంగా నడుస్తుంది. ఇది కేవలం 0.48 సెకన్లలో ఫోన్ అన్లాక్ చేయగల ఒక ఇన్- డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సారుతో వస్తుంది. ఇది ఫ్యూజన్ బ్లూ మరియు ఫాంటమ్ పర్పల్ వంటి రెండు రంగుల ఎంపికలతో లభిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo