గేమింగ్ ప్రత్యేకంగా రానున్న VIVO Z1 x స్మార్ట్ ఫోన్

గేమింగ్ ప్రత్యేకంగా రానున్న VIVO Z1 x స్మార్ట్ ఫోన్
HIGHLIGHTS

ఈ స్మార్ట్ ఫోన్ మొబైల్ గేమర్‌లను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది.

వివో తన Z 1 X స్మార్ట్‌ ఫోన్ను, సెప్టెంబర్ 6 న మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతున్నట్లు, వివో ప్రకటించింది. అలాగే, ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ హ్యాండ్‌సెట్ అందుబాటులో ఉంచనున్నట్లు కంపెనీ ప్రకటించింది. "Z1X స్మార్ట్ ఫోన్ ముఖ్యముగా పెర్ఫార్మెన్క్ – బేస్డ్ ఆధారితమైనదని, భారీ గ్రాఫిక్స్ గల గేమ్స్ ఆడటానికి ఇష్టపడే వినియోగదారుల కోసం రూపొందించబడినట్లు" కంపెనీ చెబుతోంది. కాబట్టి, ఈ స్మార్ట్ ఫోన్ మొబైల్ గేమర్‌లను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది.

వివో జెడ్ 1 ఎక్స్ గురించి అదనపు సమాచారం సంస్థ ఇంకా తెలియచేయనప్పటికీ, దాని గురించి మరింత సమాచారం టీజర్ వీడియోలో వెల్లడైంది. ఈ సంస్థ ట్విట్టర్‌లో ఒక వీడియోను పోస్ట్ చేసింది, ఇది డిస్ప్లేలో ఒక వేలిముద్ర సెన్సార్ మరియు ఈ ఫోనులో ఒక ట్రిపుల్-రియర్ కెమెరా సెటప్ ఉన్నట్లు నిర్ధారిస్తుంది. ఈ వీడియో రాబోయే స్మార్ట్‌ఫోన్‌ను పూర్తిగా ప్రదర్శిస్తుంది, దీనిని డ్యూడ్రాప్ నాచ్ డిస్ప్లే డిజైన్ మరియు గ్రేడియంట్ రియర్ ప్యానెల్‌తో చూడవచ్చు. దాని స్పెసిఫికేషన్ల గురించి అధికారిక సమాచారం లేనప్పటికీ, మునుపటి కొన్ని లీక్‌లు మరియు నివేదికల నుండి ఈ ఫోన్ ఎలావుండనుందో ఒక అంచనా ఇస్తుంది.

వివో జెడ్ 1 ఎక్స్ ట్రిపుల్-రియర్ కెమెరా సెటప్ కోసం ఒక 48MP  ప్రైమరీ సెన్సార్‌తో మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌గారానున్నట్లు  పేర్కొనబడింది. అంటే, ఈ స్మార్ట్‌ఫోన్‌ ఇండియాలో రూ .20,000 లోపు ధర ఉంటుందని సూచిస్తోంది. ఇక కంపెనీ ఇటీవల చైనాలో ప్రారంభించిన వివో జెడ్ 5 ను వివో జెడ్ 1 ఎక్స్ గా రీబ్రాండ్ చేసే అవకాశం కూడా ఉంది. వివో జెడ్ 5, 1080 x 2340 పిక్సెల్ రిజల్యూషన్‌తో ఒక 6.38-అంగుళాల ఫుల్ హెచ్‌డి + సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది మరియు ఇది స్నాప్‌డ్రాగన్ 712 SoC యొక్క శక్తితో వస్తుంది. ఒక 4500 ఎంఏహెచ్ బ్యాటరీతో, 22.5W ఫ్లాష్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి మద్దతు ఇస్తుంది, హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 9 పై ఆధారంగా FunTouch OS 9.1 పై నడుస్తుంది.

వివో జెడ్ 5, 8 జిబి ర్యామ్ వరకు మరియు 128 జిబి వరకు ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. హ్యాండ్‌సెట్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను పొందుతుంది, దీనిలో 48 MP ప్రాధమిక సెన్సార్ ఎఫ్ / 1.79 ఎపర్చరు లెన్స్,  f / 2.2 లెన్స్‌తో 8 MP వైడ్ యాంగిల్ సెకండరీ సెన్సార్ మరియు f / 2.4 ఎపర్చర్‌తో మూడవ 2 MP  సెన్సార్ ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo