48MP+8MP+2MP కెమేరా గల వివో Z1x మొదటి సేల్ 12 గంటలకు మొదలు

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 13 Sep 2019
HIGHLIGHTS

ఒక ట్రిపుల్ కెమేరా మరియు ఒక 32MP సెల్ఫీ కెమేరాతో వస్తుంది.

48MP+8MP+2MP కెమేరా గల వివో Z1x మొదటి సేల్ 12 గంటలకు మొదలు

Dell Vostro

Power New Possibilities | Dell PCs starting at Rs.35,990*

Click here to know more

Advertisements

VIVO తన Z సిరీస్ నుండి  Z1x ను గొప్ప ట్రెండీ ఫీచర్లు మరియు ప్రీమియం లుక్స్ తో ఇండియాలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఒక ట్రిపుల్ కెమేరా మరియు ఒక 32MP సెల్ఫీ కెమేరాతో వస్తుంది. ముఖ్యంగా ఇది ట్రిపుల్ రియర్ కెమేరాతో పాటుగా సూపర్ AMOLED FHD+ డిస్ప్లేతో మంచి వైవిధ్యమైన రంగులను అందిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ రేపు మధ్యాహ్నం 12 గంటలకి ఫ్లిప్ కార్ట్  నుండి జరగనుంది.

వివో Z1x ధర

1.  6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ - Rs.16,990/-

2.  6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ - Rs.18,990/-

వివో Z1x ధర  ఫీచర్లు మరియు ప్రత్యేకతలు

ఈ వివో Z1x మొబైల్ ఫోన్, ఒక 6.38-అంగుళాల FHD + స్క్రీన్‌ తో వస్తుంది. ఇది సూపర్ AMOLED డిస్ప్లే మరియు ఒక వాటర్‌డ్రాప్ నోచ్ తో వస్తుంది. ఈ మొబైల్ ఫోన్‌ లో, ఎగవంతమైనటువంటి ఒక స్నాప్ డ్రాగన్ 712 AIE ఆక్టా కోర్ ప్రాసెసర్ ని అందించింది. అదనంగా, ఇది 6GB RAM తో అనుసంధానం చెయ్యబడింది మరియు ఇది 64GB /128GB అంతర్గత స్టోరేజితో వస్తుంది. ఈ ఫోన్‌లో 4,500 mAh సామర్థ్యం గల పెద్ద బ్యాటరీ మరియు గరిష్టంగా 22.5 వాట్స్ వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది. ఇందులో, గేమింగ్ మరియు మల్టి టాస్కింగ్ కోసం ప్రత్యేకంగా మల్టి టర్బోలను అందించారు.

ఇక ఫోటోగ్రఫీ విషయానికి వస్తే, ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందుతుంది. ఒక 48MP ప్రాధమిక సెన్సార్‌కి జతగా మరొక 8MP వైడ్ యాంగిల్ కెమెరా మరియు ఒక  2MP డెప్త్ సెన్సార్ కూడా లభిస్తుంది. ఇది కాకుండా, మీకు ఈ ఫోన్‌లో ఒక 32 MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీల కోసం అందించబడింది. ఈ ఫోన్, ఫన్ టచ్ OS స్కిన్ పైన ఆండ్రాయిడ్ 9 ఫై ఆధారితంగా నడుస్తుంది. ఇది కేవలం 0.48 సెకన్లలో ఫోన్ అన్లాక్ చేయగల ఒక ఇన్- డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సారుతో వస్తుంది. ఇది ఫ్యూజన్ బ్లూ మరియు ఫాంటమ్ పర్పల్ వంటి రెండు రంగుల ఎంపికలతో లభిస్తుంది.

వివో Z1x Key Specs, Price and Launch Date

Price:
Release Date: 06 Sep 2019
Variant: 64GB , 128GB
Market Status: Launched

Key Specs

  • Screen Size Screen Size
    6.38 | NA
  • Camera Camera
    8 + 48 + 2 | 32 MP
  • Memory Memory
    64GB/6GB
  • Battery Battery
    4500 mAh
logo
Raja Pullagura

Tags:
vivo z1x
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements
Advertisements

టాప్ -ప్రోడక్టులు

hot deals amazon

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status