అతితక్కువ ధరలో 16+8+5 ట్రిపుల్ కెమేరా, పంచ్ హోల్ సెల్ఫీ డిజైన్ మరియు గొప్ప ప్రాసెసరుతో వచ్చిన VIVO Z1 PRO సేల్

Updated on 08-Jul-2019
HIGHLIGHTS

మొదటి సేల్ జూలై 11 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి Flipkart ఆన్లైన్ ప్లాట్ఫారం నుండి జరగనుంది.

వివో సంస్థ, తన సరికొత్త VIVO Z1 PRO స్మార్ట్ ఫోన్నుగొప్ప ఫీచర్లతో తీసుకొచ్చింది. ప్రస్తుతం, ఇండియాలో  అందుబాటులోవున్న పంచ్ హోల్ డిజైన్ స్మార్ట్ ఫోన్లన్నింటిలో కూడా అతితక్కువ ధరకే కొనగల స్మార్ట్ ఫోనులలో ఇది ముందు వరుసలో నిలుస్తుంది. కేవలం ఇది ఒక్కటి మాత్రమే కాదు, ఈ మిడ్ రేంజ్ ధరలో ట్రిపుల్ కెమేరా, పంచ్ హోల్ డిజైన్, బెస్ట్ ప్రాసెసర్ మరియు బెస్ట్ బ్యాటరీ వంటి అన్ని లక్షణాలను ఈ ఫోన్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ జూలై 11 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి Flipkart ఆన్లైన్ ప్లాట్ఫారం నుండి జరగనుంది.  

VIVO Z1 PRO ప్రత్యేకతలు

ఈ వివో Z1 ప్రో, డిస్ప్లే లోపల ఒక పంచ్ హోల్ డిజైనుతో ఒక 90.77 స్క్రీన్ టూ బాడీ రేషియాతో  2340×1080 పిక్సెళ్ళు గల ఒక 6.3-అంగుళాల FHD+ డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోను ఒక బ్యాక్ -మౌంటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ను కలిగి ఉంది. ఈ ఫోన్ గరిష్టంగా 2.3 క్లాక్ స్పీడ్ అందించగల ఒక 10nm finfit కలిగిన క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 712 AIE SoC కి జతగా 4GB లేదా 6GB RAM వేరియంట్లలో 64GB లేదా 128GB స్టోరేజిలలో లభిస్తాయి. ఈ స్మార్ట్ ఫోన్, ఒక 5,000 mAh బ్యాటరీ మరియు 18 W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది.

వివో Z1 ప్రో యొక్క కెమేరా విభాగానికి వస్తే, ఇది  పోర్ట్రైట్ షాట్లకు అనుగుణంగా ఒక 5MP మూడవ సెన్సారుతో జతగా కలిపిన ప్రధాన 16MP సెన్సారు మరియు మరొక 8MP సూపర్ అల్ట్రా వైడ్ సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియార్ కెమేరాతో ఉంటుంది. ఈ వివో Z1 ప్రో యొక్క 16MP ప్[ప్రధాన కెమేరా f/1.78 అపర్చరుతో అందించబడింది.  ఇది తక్కువ కాంతి లో కూడా మంచి షాట్లు తీసుకోవటానికి సహాయపడుతుంది. ఇక ముందుభాగంలో, పోర్త్రైట్ మోడ్  మరియు పేస్ బ్యూటిఫికేషన్ కి సపోర్ట్ చేసేలా, AI అల్గారిథం కలిగిన ఒక 32MP కెమెరా ఉంటుంది

వివో Z1 ప్రో : ధర మరియు ఆఫర్లు

1. వివో Z1 ప్రో  – 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ : రూ. 14,990

2. వివో Z1 ప్రో  – 6GB ర్యామ్ + 64GB స్టోరేజ్ : రూ. 16,999

3. వివో Z1 ప్రో  – 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ : రూ. 17,999

ఈ స్మార్ట్ ఫోన్ను Flipkart నుండి Axis బ్యాంక్ Buzz క్రెడిట్ కార్డుతో  కొనుగోలు చేసేవారికీ 10% తగ్గింపు అందుకునే అవకాశం లభిస్తుంది. అధనంగా Flipkart నుండి  ICICI బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డుతో కొనుగోలు చేసేవారికి 750 రూపాయల తక్షణ డిస్కౌంట్ వంటి ఆఫర్లు కూడా అందుబాటులో వున్నాయి.             

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :