VIVO X30 ప్రొఫెషనల్ కెమేరాలకు దీటైన కెమేరాతో వస్తోంది

HIGHLIGHTS

ఈ ఫోనుతో 60X జూమ్ చేయవచ్చు.

VIVO X30 ప్రొఫెషనల్ కెమేరాలకు దీటైన కెమేరాతో వస్తోంది

 vivo సంస్థ నుండి విడుదల కానున్న స్మార్ట్ అయినటువంటి, VIVO X30 గురించి విడుదల చేసిన కొత్త టీజింగ్ ద్వారా ఈ ఫోన్ అత్యంత ఉన్నత సామర్ధ్యం గల ఫోటోలను అందించగలదని అర్ధమవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ను, శామ్సంగ్ యొక్క వేగవంతమైన మరియు 5G ఎనేబుల్ ప్రాసెసర్ అయినటువంటి Samung Exynos 980 5G తో తీసుకురానున్నట్లు ముందుగానే తేలియచేసింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇక కొత్తగా వచ్చిన టీజింగ్ ద్వారా ఈ ఫోన్ 50MM లెన్స్ ఉపయోగించి చిత్రీకరించే, ప్రొఫెషనల్ ఫోటోల వంటి ఫోటోలను తీసే సామర్ధ్యాలను కలిగి ఉంటుందని చెబుతోంది. ఈ వివరాలను వివో యొక్క మైక్రో బ్లాగ్ లో అందించింది. అంతేకాదు, ఈ కెమేరాకు సంబంధిచిన మరికొన్ని ప్రత్యేకతలను కూడా వివరించింది.  వివో, అతిత్వరలో చైనాలో లాంచ్ చెయ్యనున్న ఈ స్మార్ట్ ఫోన్ కెమేరా యొక్క ప్రత్యేకతలను చూస్తుంటే, నిజంగా ఒక గొప్ప ఫ్లాగ్ షిప్ ఫోనుగా అందరి దృష్టిని ఆకర్షించేలా కనిపిస్తుంది.

అలాగే, ఈ కేమెరా యొక్క మరొక గొప్ప ప్రత్యేకత గురించి మాట్లాడితే, ఈ ఫోన్ యొక్క కెమేరాతో 5X పెరిస్కోప్ జూమ్ చేసుకోవచ్చు. అంటే, చాలా దూరంలో ఉండే వివరాలను కూడా చాలా స్పష్టంగా మరియు దగ్గరగా చూడవచ్చని కంపెనీ పేర్కొంది. అంతేకాదు, ఈ ఫోనుతో 60X జూమ్ చేయవచ్చని, వివో ముందుగా తెలియచేసింది. అయితే, ఇప్పుడు కొత్తగా ఇచ్చిన టీజర్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.                                      

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo