vivo X Fold3 Pro: ఇండియాలో మొదటి ఫోల్డ్ ఫోన్ లాంచ్ చేస్తున్న వివో.!

HIGHLIGHTS

ఇండియాలో మొదటి ఫోల్డ్ ఫోన్ లాంచ్ చేస్తున్నట్లు వివో ప్రకటించింది

గ్లోబల్ మార్కెట్ లో ఇప్పటికే ఫోల్డ్ ఫోన్ లను విరివిగా అందించిన వివో

vivo X Fold3 Pro ఫోల్డ్ ఫోన్ ను తీసుకు వస్తోంది

vivo X Fold3 Pro: ఇండియాలో మొదటి ఫోల్డ్ ఫోన్ లాంచ్ చేస్తున్న వివో.!

vivo X Fold3 Pro: ఇండియాలో మొదటి ఫోల్డ్ ఫోన్ లాంచ్ చేస్తున్నట్లు వివో ప్రకటించింది. గ్లోబల్ మార్కెట్ లో ఇప్పటికే ఫోల్డ్ ఫోన్ లను విరివిగా అందించిన వివో, ఇప్పుడు ఇండియన్ మార్కెట్ లో కూడా ఫోల్డ్ ఫోన్ ను తీసుకు వస్తోంది. ఈ ఫోన్ కోసం అందించిన టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ వివరాలు కూడా కొన్ని బయటపెట్టింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

vivo X Fold3 Pro:

వివో X ఫోల్డ్ 3 ప్రో స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేయనున్నట్లు కంపెనీ టీజింగ్ మొదలు పెట్టింది. ఈ ఫోన్ లాంచ్ వివరాలతో Flipkart నుండి టీజింగ్ అందించింది. అంటే, ఈ ఫోన్ ను ప్రత్యేకమైన సేల్ పార్ట్నర్ గా ఫ్లిప్ కార్ట్ వ్యవహరిస్తోంది. ఫ్లిప్ కార్ట్ ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ టీజర్ పేజ్ ను కూడా అందించింది.

vivo X Fold3 Pro టీజింగ్ పేజ్ ఏమి చెబుతోంది?

వివో X ఫోల్డ్ 3 ప్రో స్మార్ట్ ఫోన్ కోసం అందించిన టీజింగ్ పేజ్ నుండి ఈ ఫోన్ డిజైన్ ను చూపించింది. అయితే, ఈ ఫోన్ కంప్లీట్ డిజైన్ ను వివరించేలా మాత్రం ఈ టీజింగ్ ఇమేజ్ లేదు. కానీ ఈ ఫోన్ కొన్ని వివరాలను మాత్రమే ఇమేజ్ తెలియ చేస్తోంది.

vivo X Fold3 Pro Teased Image
vivo X Fold3 Pro Teased Image

ఈ టీజర్ ఇమేజ్ నుండి ఈ ఫోన్ చాలా సన్నని అంచులు కలిగిన బిగ్ డిస్ప్లే కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఫోన్ లో వెనుక పెద్ద కెమెరా బంప్ ఉన్నట్లు కూడా కనిపిస్తోంది. ఈ ఫోన్ ను కూడా Zeiss ఆప్టిక్స్ మరియు ట్రేడ్ మార్క్ కలిగిన కెమెరా సెటప్ తో తీసుకొస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది.

Also Read: జబర్దస్త్ ఆఫర్: భారీ డిస్కౌంట్ తో సగం ధరకే లభిస్తున్న Sony Smart TV

ఈ ఫోన్ టీజర్ పేజ్ లో అందించిన నోట్ నుండి ఈ ఫోన్ ఇండియన్ మార్కెట్ లో ఫోల్డ్ ఫోన్ లవ్ బెస్ట్ ఇన్ డిజైన్, డిస్ప్లే, బ్యాటరీ మరియు ఛార్జ్ టెక్ లో గట్టి పోటీగా రాబోతున్నట్లు మాత్రం తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ యొక్క మరిన్ని వివరాలు త్వరలోనే అందిస్తుందని కూడా టీజర్ ద్వారా టీజింగ్ చేస్తోంది.

ఈ ఫోన్ యొక్క లాంచ్ డేట్ ను కంపెనీ ఇంకా అనౌన్స్ చేయలేదు . కానీ, Coming Soon ట్యాగ్ తో టీజింగ్ ను మొదలు పెట్టింది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo