Vivo V80 price features and specs know one day before launch
Vivo V80: వివో చాలా రోజులుగా టీజింగ్ చేసిన వివో వి80 స్మార్ట్ ఫోన్ ఎట్టకేలకు రేపు లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ వివో ప్రీమియం స్మార్ట్ ఫోన్ సిరీస్ అయిన V Series నుంచి లాంచ్ అవుతున్న లేటెస్ట్ ఫోన్ మరియు ఇది లేటెస్ట్ డిజైన్ తో వస్తుంది. ఈ ఫోన్ ప్రీమియం కెమెరా మరియు ప్రత్యేకమైన ఫీచర్స్ తో రేపు లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ లాంచ్ కంటే ఒకరోజు ముందే కంప్లీట్ ఫీచర్స్ మరియు అంచనా ప్రైస్ పై ఓకే లుక్కేద్దామా.
వివో వి 80 స్మార్ట్ ఫోన్ రేపు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ తో పాటు వివో ఎస్ 2FE స్మార్ట్ ఫోన్ ని కూడా వివో లాంచ్ చేస్తుంది.
వివో ఈ స్మార్ట్ ఫోన్ ను సరికొత్త డిజైన్ తో లాంచ్ చేస్తోంది. ఈ కొత్త డిజైన్ లో ఫోన్ చాలా ప్రీమియం లుక్ తో చూడగానే ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఈ ఫోన్ లో 6.59 ఇంచ్ పర్ఫెక్ట్ సైజ్ ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. ఈ ఫోన్ 1.5K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్ మరియు 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ప్రీమియం ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ లో సినిమాటిక్ వీడియోలు మరియు DSLR వంటి ఫోటోలు అందించే జబర్దస్త్ కెమెరా ఉన్నట్లు వివో తెగ టీజింగ్ చేసింది. ఇందులో వెనుక 50MP మెయిన్, ZEISS అల్ట్రా వైడ్ కెమెరా మరియు 50MP నైట్ టెలిఫోటో కెమెరా కలిగిన రియర్ కెమెరా మరియు ముందు 50MP సెల్ఫీ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ 60 FPS 4K వీడియో సపోర్ట్ ని సినిమాటిక్ ఫీచర్ తో అందించింది. ఇదే కాదు AI దివాళీ పోర్ట్రైట్ 2.0 ఫీచర్ మరియు ప్రత్యేకమైన లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
ఇక ఈ ఫోన్ బ్యాటరీ విషయానికి వస్తే, ఈ ఫోన్ ను 7200 mAh బిగ్ బ్యాటరీతో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 90W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ తో వివో ఈ ఫోన్ ను లాంచ్ చేస్తునట్లు అనౌన్స్ చేసింది. ఈ ఛార్జ్ టెక్ ఈ ఫోన్ కేవలం 30 నిమిషాల్లోనే 50 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఇక ఈ ఫోన్ OS విషయానికి వస్తే, ఈ ఫోన్ ను లేటెస్ట్ ఆండ్రాయిడ్ 17 os తో పని చేసే Color OS 17 తో లాంచ్ చేస్తోంది. ఇది లేటెస్ట్ డిజైన్, జబర్దస్త్ కెమెరా మరియు ఎక్కువ కలం నిలిచి ఉండే బ్యాటరీ లైఫ్ వంటి ఫీచర్స్ తో లాంచ్ అవుతుంది.
Also Read: Aadhaar Name తప్పుగా ఉందా .. UIDAI కొత్త రూల్ గురించి వెంటనే తెలుసుకోండి.!
ఈ ఫోన్ ను ప్రీమియం స్మార్ట్ ఫోన్ గా వివో లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ ను రూ. 65,000 నుంచి రూ. 70,000 రూపాయల ప్రైస్ రేంజ్ లో లాంచ్ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.