Aadhaar Name తప్పుగా ఉందా .. UIDAI కొత్త రూల్ గురించి వెంటనే తెలుసుకోండి.!

HIGHLIGHTS

Aadhaar Name తప్పుగా ఉంటే ఆధార్ సెంటర్ కి వెళ్లి మార్చుకోవడం కష్టంగా మారనున్నది

పేరు కరెక్షన్ మరియు చేంజ్ కోసం UIDAI కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) రూల్ తెచ్చింది

కొత్త రూల్ ప్రకారం ఆధార్ లో పేరు సరి చేయడం లేదా మార్పు చేయడం పెద్ద టాస్క్ గా మారింది

Aadhaar Name తప్పుగా ఉందా అయితే ఏమైంది ఆధార్ సెంటర్ కి వెళ్లి చాలా ఈజీ గా మార్చుకోవచ్చు, అని మీరు అనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే, ఆధార్ పేరు లో మార్పు లేదా పేరు మార్పు చేయడం ఇప్పుడు చాలా కష్టం అవుతుంది. ఆధార్ లో పేరు కరెక్షన్ మరియు చేంజ్ కోసం UIDAI కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) రూల్ తెచ్చింది. ఈ కొత్త రూల్ ప్రకారం ఆధార్ లో పేరు సరి చేయడం లేదా మార్పు చేయడం పెద్ద టాస్క్ గా మారింది. అయితే, ఆధార్ ఎంట్రీ సమయంలో ఆపరేటర్ చేసే తప్పులు మాత్రం ఈజీగా మార్పు చేసుకోవడానికి అవకాశం అందించింది.

Aadhaar Name – UIDAI

ఒక నుంచి ఆధార్ పేరు అప్డేట్ అనేది పెద్ద సమస్యతో కూడిన విషయంగా మీకు అనిపించే అవకాశం వుంది. ఎందుకంటే, యుఐడిఎఐ ఇకపై ప్రతి పేరు మార్పును ఒకే విధంగా పరిగణించదు. పేరు మార్పు స్వభావాన్ని బట్టి ఏ పత్రాలు సమర్పించాలి, అది సాధారణ సవరణా లేదా పెద్ద పేరు మార్పా చేస్తున్నారు, అన్నదానిపై యుఐడిఎఐ ఇక ప్రత్యేక విధానాన్ని అమలు చేస్తోంది.

సెప్టెంబర్ 18వ తేదీన యుఐడిఎఐ ఈ కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) రూల్ తెచ్చింది. గతంలో 2021 నుంచి సెప్టెంబర్ వరకు కూడా ఆధార్ పేరు సవరణ మరియు మార్పు కోసం ఒకే రూల్ ను ఫాలో చేసిన యుఐడిఎఐ ఇప్పుడు ఆధార్ ని మరింత కట్టుదిట్టమైన పత్రంగా మార్చేలా ఈ కొత్త రూల్స్ తెచ్చింది. ఈ కొత్త రూల్ ప్రకారం, పేరు స్పెల్లింగ్ సవరణలు, పేరులో పదాల జోడింపు లేదా తొలగింపు, పేరు క్రమం మార్చడం, డేటా ఎంట్రీ పొరపాట్లు, ప్రాంతీయ భాషలో పేరు తప్పుగా నమోదు కావడం, వివాహం లేదా విడాకుల కారణంగా ఇంటి పేరు మార్పు, పూర్తి పేరు మార్పు వంటి వివిధ పరిస్థితులను ప్రత్యేకమైన మార్పుగా పరిగణిస్తుంది.

Aadhaar Name ఎన్నిసార్లు మార్చే అవకాశం ఉంది?

ఇది ఎప్పటి నుంచో కొనసాగుతున్న అదే రూల్ ఇప్పుడు కూడా కొనసాగుతుంది. జీవిత కాలంలో ఆధార్ పేరును కేవలం రెండు సార్లు మాత్రమే మార్చడానికి అవకాశం వుంది. అయితే, కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో పేరు సవరణ లేదు పేరు మార్పుకు అవకాశం ఇస్తుంది. అయితే, ఇలాంటి ప్రత్యేకమైన సందర్భంలో పేరు మార్పు కోసం దగ్గరలోని ప్రాంతీయ కార్యాలయం లో మాత్రం అభ్యర్ధన చేయాల్సి ఉంటుంది.

Also Read: OPPO F35 Pro 5G గ్రూప్ సెల్ఫీ కెమెరా వంటి ప్రీమియం ఫీచర్స్ తో వచ్చింది .. ప్రైస్ అండ్ ఫీచర్స్ తెలుసుకోండి.!

స్పెల్లింగ్ తప్పు ఉంటే ఏమి చేయాలి?

ఇది సాధారణ తప్పుగా పరిగణించబడుతుంది. దీనికోసం ఎక్కువగా పాత్రలు అడగక పోవచ్చు. అయితే, స్పెల్లింగ్, ఫోనెటిక్, ఇంటి పేరు మార్పు లేదా పేరు చేర్చడం లేదా పొడిగించడం వంటి వాటిని మాత్రం ప్రత్యేక మార్పుగా యుఐడిఎఐ పరిగణిస్తుంది మరియు దీని కోసం తగిన ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ప్రూఫ్ ని కూడా సమర్పించాల్సి ఉంటుంది.

అంటే, పెళ్ళైన తర్వాత ఇంటి పేరు మార్చడం లేదా విడాకుల తర్వాత ఇంటి పేరు తొలగించడం వంటివి ప్రత్యేకమైన మార్పు పరిగణలోకి వస్తాయి. ఇలాంటి సందర్భాల్లో మ్యారేజ్ సర్టిఫికెట్ లేదా అడాప్షన్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. అయితే, స్పెల్లింగ్ తప్పుగా ఉంటే పేరు పూర్తిగా మార్చుకోవాలనుకుంటే మాత్రం గెజిటెడ్ అఫిడవిట్ ని కూడా సమర్పించాల్సి ఉంటుంది.

ఇలా ఆధార్ పేరు మార్పు స్వభావాన్ని బట్టి దానికి తగిన నియమం ఉంటుంది మరియు దానికి తగిన పాత్రలు కూడా సమర్పించాల్సి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :