Flipkart Sale offers 5.1 Dolby Atmos at only Rs 8999 only
Flipkart Sale నుంచి ఈరోజు జబర్దస్త్ సౌండ్ బార్ డీల్ ని అనౌన్స్ చేసింది. ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ డీల్స్ తో కేవలం రూ. 8,999 చవక రేటుకే 5.1 Dolby Atmos సౌండ్ బార్ ని అందుకునే అవకాశం దక్కింది. అది కూడా జెబ్రోనిక్స్ యొక్క లేటెస్ట్ 5.1 డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ ని అవకాశం యూజర్లకు అందుబాటులో ఉంది. ఈ సౌండ్ బార్ ఆఫర్ మరియు ఈ సౌండ్ ఫీచర్స్ వివరంగా చూద్దాం.
ZEBRONICS రీసెంట్ గా విడుదల చేసిన కొత్త సౌండ్ బార్ Juke Bar 9700 Pro ని ఫ్లిప్ కార్ట్ ఈ ఆఫర్ ధరలో సేల్ చేస్తోంది. ఈ సౌండ్ బార్ ని ఈరోజు 78% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 9,999 రూపాయల ఆఫర్ ధరలో ఫ్లిప్ కార్ట్ సేల్ చేస్తోంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ పై రూ. 1,000 రూపాయల ICICI అండ్ Axis బ్యాంక్ క్రెడిట్ కార్డు అదనపు డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 8,999 రూపాయల అతి చవక ధరలో లభిస్తుంది.
ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఈ సౌండ్ బార్ ని ఆఫర్ చేస్తున్న ధరలో ఇది బెస్ట్ 5.1 ఛానల్ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ డీల్ గా నిలిచింది. ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.2 రేటింగ్ మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది.
Also Read: Samsung Galaxy S25 Ultra అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ గ్రేట్ డీల్ గా వచ్చింది.!
ఈ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు టోటల్ 525W అవుట్ పుట్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ మూడు స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ ని కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ పూర్తిగా వైర్డ్ సెటప్ తో వస్తుంది మరియు ఫుల్ ఫంక్షన్ రిమోట్ తో పాటు ఫిజికల్ మీడియా కంట్రోల్ బటన్స్ కూడా కలిగి ఉంటుంది.
ఈ సౌండ్ బార్ 5.1 డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్ సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ కలిగిన స్పీకర్ సెటప్ మరియు సౌండ్ టెక్నాలజీ తో రిచ్ ఫీల్ థియేటర్ సౌండ్ అందిస్తుంది. అంటే, ఈ సౌండ్ బార్ ప్రైస్ లో బెస్ట్ సౌండ్ ఆఫర్ చేస్తుందని చెబుతున్నాను. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే, ఇందులో HDMI eArc, ఆప్టికల్, USB, బ్లూటూత్ మరియు AUX వంటి కంప్లీట్ కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి.