Vivo V80: న్యూ డిజైన్ అండ్ సినిమాటిక్ కెమెరా ఫీచర్స్ తో ప్రీమియం సెగ్మెంట్ ఫోన్ గా వచ్చింది.!

HIGHLIGHTS

విప్ ఈరోజు ఇండియన్ మార్కెట్లో మూడు కొత్త స్మార్ట్ ఫోన్లు విడుదల చేసింది

Vivo V80 ను న్యూ డిజైన్ అండ్ సినీ మట్టికి కెమెరా వంటి ప్రీమియం ఫీచర్స్ తో వివో అందించింది

ఇది 60FPS తో 4K వీడియో సినిమాటిక్ వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది

Vivo V80: విప్ ఈరోజు ఇండియన్ మార్కెట్లో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు విడుదల చేసింది వీటిలో వివో వి 80 ప్రీమియం స్మార్ట్ ఫోన్ గా అడుగు పెట్టింది. ఈ స్మార్ట్ ఫోన్ ను న్యూ డిజైన్ అండ్ సినీ మట్టికి కెమెరా వంటి ప్రీమియం ఫీచర్స్ తో వివో అందించింది. ఈ ఫోన్ సరికొత్తగా విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూద్దామా.

Vivo V80: ప్రైస్ అండ్ ఆఫర్స్

వివో ఈ ఫోన్ ను మూడు వేరియంట్స్ ల్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ బేసిక్ 8GB + 128GB వేరియంట్ ను రూ. 62,999 ధరతో మరియు 8GB + 256GB వేరియంట్ ను రూ. 69,999 ధరతో లాంచ్ చేసింది. అయితే, ఈ ఫోన్ హై ఎండ్ 8GB + 512GB వేరియంట్ ను మాత్రం రూ. 79,999 ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ సన్ రైజ్ యాన్తం, హారిజన్ బ్లూ మరియు స్టెల్లార్ బ్లాక్ అనే మూడు రంగుల్లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ప్రీ ఆర్డర్స్ ని ఈరోజు 3 గంటలకు స్టార్ట్ చేస్తుంది.

ఆఫర్స్

వివో ఈ ఫోన్ లాంచ్ లో భాగంగా ఈ ఫోన్ పై భారీ డీల్స్ మరియు ఫీచర్స్ అందించింది. ఫ్లాట్ 10% బ్యాంక్ క్యాష్ బ్యాక్ ఆఫర్ ని అందించింది. ఇది కాకుండా 1 సంవత్సరం అదనపు వారంటీ మరియు అదనపు ఎక్స్ చేంజ్ ఆఫర్ కూడా అందించింది.

Also Read: సాధారణ స్మార్ట్ టీవీ రేటుకే కొత్త 55 Mini LED Smart Tv లాంచ్ చేసిన Kodak .. ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే.!

Vivo V80: ఫీచర్స్

వివో ఈ ఫోన్ ను చాలా అందమైన మరి ఆకట్టుకునే స్లీక్ డిజైన్ లో అందించింది. ఈ ఫోన్ 6.59 ఇంచ్ స్క్రీన్ ను 1.5K రిజల్యూషన్ మరియు 144Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. అంతేకాదు, 3D అల్ట్రా సోనిక్ సింగల్ పాయింట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ కూడా ఈ స్క్రీన్ కలిగి ఉంటుంది.

వివో ఈ ఫోన్ ను క్వాల్కమ్ Snapdragon 7 Gen 4 ప్రాసెసర్ తో లాంచ్ చేసింది. అలాగే, ఇందులో 8GB ఫిజికల్, 8GB అదనపు ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా అందించింది. ఈ ఫోన్ ను లేటెస్ట్ ఆండ్రాయిడ్ 17 OS తో అందించింది మరియు ఈ ఫోన్ లో లేటెస్ట్ కలర్ OS సాఫ్ట్ వేర్ జతగా ఉంటుంది.

ఈ వివో ఫోన్ కెమెరా ప్రత్యేకమైన ఫోన్ గా మార్కెట్ లో అడుగుపెట్టింది. ఇందులో 50MP ప్రధాన సెన్సార్ జతగా ZEISS అల్ట్రా వైడ్ అండ్ 50MP నైట్ టెలిఫోటో సెన్సార్ లు కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. ఇది 60FPS తో 4K వీడియో సినిమాటిక్ వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగిన 50MP సెల్ఫీ కెమెరా కూడా ఈ ఫోన్ లో ఉంది. ఈ ఫోన్ లో AI దివాళీ పోర్ట్రైట్ 2.0 ఫీచర్తో పాటు ప్రత్యేకమైన వివో కెమెరా ఫీచర్స్ కూడా ఉన్నాయి.

ఈ ఫోన్ లో అందించిన బ్యాటరీ మరియు ఛార్జ్ టెక్ కూడా చాలా ముఖ్యమైన ఫీచర్ అవుతాయి. ఎందుకంటే, ఈ ఫోన్ ను 7200 mAh బిగ్ బ్యాటరీ మరియు 90W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ ఉంది. ఇది ఈ ఫోన్ ను ఎక్కువ కాలం నిలిఫై ఉంచుతుంది మరియు చాలా వేగంగా ఛార్జ్ కూడా చేస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :