సాధారణ స్మార్ట్ టీవీ రేటుకే కొత్త 55 Mini LED Smart Tv లాంచ్ చేసిన Kodak .. ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే.!

HIGHLIGHTS

Kodak ఈరోజు సాధారణ స్మార్ట్ టీవీ రేటుకే కొత్త 55 Mini LED Smart Tv లాంచ్ చేసింది.

Mini-QD స్క్రీన్ మరియు క్వాడ్ స్పీకర్ సిస్టం వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్

ఈ స్మార్ట్ టీవీ ని చాలా తక్కువ ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ తో అందించింది

సాధారణ స్మార్ట్ టీవీ రేటుకే కొత్త 55 Mini LED Smart Tv లాంచ్ చేసిన Kodak .. ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే.!

Kodak ఇండియన్ మార్కెట్లో ఈరోజు సాధారణ స్మార్ట్ టీవీ రేటుకే కొత్త 55 Mini LED Smart Tv లాంచ్ చేసింది. దసరా పండుగ సందర్భంగా కొడాక్ ఈ కొత్త స్మార్ట్ టీవీ లాంచ్ చేసినట్లు పేర్కొంది. ఈ స్మార్ట్ టీవీ ని చాలా తక్కువ ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ తో అందించింది. ఈ టీవీ అధిక బ్రైట్నెస్ కలిగిన స్క్రీన్ మరియు క్వాడ్ స్పీకర్ సిస్టం వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Kodak 55 Mini LED Smart Tv ప్రైస్

కొడాక్ ఈ 55 ఉంచ్ మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీని K55 Mini 5060 మోడల్ నెంబర్ తో లాంచ్ చేసింది. ఈ టీవీని కేవలం రూ. 34,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ టీవీపై ఆకట్టుకునే సేల్ ఆఫర్స్ ని కూడా కొడాక్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ సేల్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. బడ్జెట్ ధరలో మినీ ఎల్ఈడి టీవీ కోరుకునే యూజర్లను దృష్టిలో ఉంచుకుని ఈ స్మార్ట్ టీవీ ని లాంచ్ చేసినట్లు కొడాక్ తెలిపింది.

Kodak 55 Mini LED Smart Tv : ఫీచర్స్

ఈ కొడాక్ లేటెస్ట్ స్మార్ట్ టీవీ 55 ఇంచ్ పరిమాణం కలిగిన పెద్ద Mini-QD ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ టీవీ డాల్బీ విజన్ మరియు HDR 10 సపోర్ట్ తో కలిగి ఉంది. అంతేకాదు, ఈ టీవీ 550 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ వంటి ప్రీమియం ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫీచర్స్ తో ఈ టీవీ గొప్ప విజువల్స్ అందించే సత్తా కలిగి ఉంటుంది. ఈ టీవీ లేటెస్ట్ క్వాడ్ కోర్ చిప్ సెట్ తో ల్యాగ్ ఫ్రీమ్ అండ్ స్మూత్ గా పని చేస్తుందని కొడాక్ తెలిపింది.

Kodak 55 Mini LED Smart Tv

ఇక ఈ టీవీ కలిగిన సౌండ్ విషయానికి వస్తే, ఈ టీవీ లో మొత్తం 4 స్పీకర్లు ఉంటాయి మరియు ఈ సెటప్ తో టోటల్ 80W అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది. ఇందులో డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్ సపోర్ట్ తో మంచి సౌండ్ కూడా ఆఫర్ చేస్తుంది. ఈ టీవీలో డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, HDMI, USB, ఆప్టికల్, AV మరియు ఈథర్నెట్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి. ఇది గూగుల్ లేటెస్ట్ OS పై నడుస్తుంది.

Also Read: Aadhaar Name తప్పుగా ఉందా .. UIDAI కొత్త రూల్ గురించి వెంటనే తెలుసుకోండి.!

2026 ఫెస్టివ్ సీజన్ లో అప్‌గ్రేడ్ చేయదగిన బెస్ట్ టీవీ ఆప్షన్ గా ఈ టీవీని మార్కెట్ లో ప్రవేశపెట్టినట్లు కొడాక్ తెలిపింది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile