Vivo V60e: మిడ్ రేంజ్ ప్రైస్ లో 200MP సూపర్ కెమెరాతో లాంచ్ అయ్యింది.!

HIGHLIGHTS

వివో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ వివో వి60e ఈరోజు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది

ఈ స్మార్ట్ ఫోన్ ను 200MP సూపర్ కెమెరా మరియు చాలా ప్రీమియం డిజైన్ తో లాంచ్ చేసింది

వివో వి60e స్మార్ట్ ఫోన్ ను మూడు వేరియంట్స్ లో లాంచ్ చేసింది

Vivo V60e: మిడ్ రేంజ్ ప్రైస్ లో 200MP సూపర్ కెమెరాతో లాంచ్ అయ్యింది.!

Vivo V60e: వివో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ వివో వి60e ఈరోజు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ ను 200MP సూపర్ కెమెరా మరియు చాలా ప్రీమియం డిజైన్ తో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ AI ఫెస్టివల్ పోర్ట్రైట్ ఫీచర్ కలిగిన ఫస్ట్ ఫోన్ గా ఇండియాలో లాంచ్ అయ్యింది. ఈ లేటెస్ట్ వివో స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్స్ పూర్తిగా తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Vivo V60e: ప్రైస్ అండ్ ఆఫర్స్

వివో వి60e స్మార్ట్ ఫోన్ ను మూడు వేరియంట్స్ లో లాంచ్ చేసింది ఈ మూడు వేరియంట్ ప్రైస్ లిస్ట్ ఈ క్రింద చూడవచ్చు.

వివో వి60e (8 జీబీ + 128 జీబీ) ధర : రూ. 29,999

వివో వి60e (8 జీబీ + 256 జీబీ) ధర : రూ. 31,999

వివో వి60e (12 జీబీ + 256 జీబీ) ధర : రూ. 33,999

వివో ఈ స్మార్ట్ ఫోన్ ప్రీ ఆర్డర్ ఈ రోజు నుంచి ప్రారంభించింది. ఈ ఫోన్ నోబెల్ గోల్డ్ మరియు ఎలైట్ పర్పల్ రెండు రంగుల్లో లభిస్తుంది. ఈ ఫోన్ పై భారీ లాంచ్ ఆఫర్లు కూడా వివో ప్రకటించింది. ఈ ఫోన్ పై NO Cost EMI, రూ. 3,200 ఇన్స్టాంట్ బ్యాంక్ డిస్కౌంట్ మరియు రూ. 3,400 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ ప్రకటించింది.

Vivo V60e: ఫీచర్స్

వివో ఈ ఫోన్ ను సూపర్ స్లీక్ డిజైన్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 7360-Turbo చిప్ సెట్ తో లాంచ్ చేసింది. ఇందులో 12 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అందించింది. ఈ ఫోన్ 6.77 ఇంచ్ క్వాడ్ కర్వుడ్ AMOELD స్క్రీన్ ని ఇన్ డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ FHD+ రిజల్యూషన్, HDR 10+ సపోర్ట్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది.

Vivo V60e

కెమెరా పరంగా, ఈ ఫోన్ 200MP డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది మరియు ఈ ఫీచర్ తో వచ్చిన మొదటి వివో ఫోన్ గా ఇది నిలిచింది. ఈ ఫోన్ లో ముందు 50MP గ్రూప్ సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్, AI ఫోర్ సీజన్ పోర్ట్రైట్, 85mm టెలిఫోటో క్లోజప్ మరియు AI ఫెస్టివల్ పోర్ట్రైట్ కెమెరా వంటి జబర్దస్త్ కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది.

Also Read: ఫస్ట్ హైబ్రిడ్ ఫోన్ HMD Touch 4G ని లాంచ్ చేసిన నోకియా యాజమాన్య కంపెనీ.!

ఈ వివో ఫోన్ చాలా స్లీక్ డిజైన్ కలిగి ఉన్నా కూడా భారీ 6500 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఈ గిగ్ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 90W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP68 అండ్ IP69 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile