Vivo V50 ట్రిపుల్ 50MP కెమెరా సిస్టం మరియు ఫాస్ట్ ప్రోసెసర్ తో లాంచ్ అయ్యింది.!
Vivo V50 స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది
50MP కెమెరా సిస్టం మరియు ఫాస్ట్ ప్రోసెసర్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ చేయబడింది
ఈ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ మరియు AI ఫీచర్స్ తో కూడా వస్తుంది
Vivo V50 స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ ట్రిపుల్ 50MP కెమెరా సిస్టం మరియు ఫాస్ట్ ప్రోసెసర్ వంటి మరిన్ని ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ చేయబడింది. ఈ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ మరియు AI ఫీచర్స్ తో కూడా వస్తుంది. ఈరోజే సరికొత్తగా విడుదలైన వివో వి 50 స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.
Vivo V50 : ప్రైస్
వివో వి 50 స్మార్ట్ ఫోన్ ను మూడు వేరియంట్లలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క 8GB + 128GB వేరియంట్ ను రూ. 34,999 ధరతో మరియు 8GB + 128GB వేరియంట్ ను రూ. 36,999 ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ యొక్క హై ఎండ్ వేరియంట్ ను 12GB + 512GB వేరియంట్ ను రూ. 40,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది.
వివో ఈ ఫోన్ యొక్క ముందస్తు బుకింగ్ లను ఈరోజు నుంచి ప్రారంభించింది. ఈ ఫోన్ మొదటి సేల్ ఫిబ్రవరి 25 తేదీన ప్రారంభం అవుతుంది. ఈ ఫోన్ ను Flipkart, Amazon మరియు వివో ప్రత్యేకమైన స్టోర్స్ తో పాటు రిలయన్స్ డిజిటల్, Croma, విజయ్ సేల్స్, సంగీత మొబైల్స్, BIG C, LOT మరియు బజాజ్ ఎలక్ట్రానిక్స్ నుంచి ప్రీ బుక్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ పై ప్రధానమైన బ్యాంక్ కార్డ్స్ పై 10% వరకు క్యాష్ బ్యాక్ మరియు ఎక్స్ చేంజ్ బోనస్ వంటి మరిన్ని ఆఫర్లు కూడా అందించింది.
Also Read: Jio Hotstar సబ్ స్క్రిప్షన్ ఉచితంగా అందుకునే గొప్ప అవకాశం అందించిన జియో.!
Vivo V50 : ఫీచర్స్
ఈ ఫోన్ ను 6.77 ఇంచ్ P3 వైడ్ కలర్ గామూట్ సపోర్టెడ్ 3D కర్వుడ్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ HDR 10+, 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Snapdragon 7 Gen 3 చిప్ సెట్ తో వస్తుంది మరియు జతగా 12GB తో పాటు 512GB స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ స్మార్ట్ ఫోన్ 50MP (OIS) మెయిన్ + 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ డ్యూయల్ రియర్ కెమెరా మరియు 50MP సెల్ఫీ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ వెడ్డింగ్ Portrait మరియు Night మోడ్ వంటి చాలా కెమెరా ఫీచర్స్ మరియు ఫిల్టర్స్ తో పాటు AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ లో 6000 mAh బిగ్ బ్యాటరీ మరియు 90W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP68 మరియు IP69 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది. వివో వి 50 స్మార్ట్ ఫోన్ Funtouch OS 15 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 15 OS పై నడుస్తుంది.