Vivo V50 Launch: పిక్చర్ పర్ఫెక్ట్ సూపర్ కెమెరాతో వస్తున్న వివో అప్ కమింగ్ ఫోన్.!
వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ ను అనౌన్స్ చేసింది
వివో V Series నుంచి ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసింది
వివో వి50 ఫోన్ ను విడుదల చేస్తున్న విషయాన్ని Vivo కన్ఫర్మ్ చేసింది
Vivo V50 Launch: వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ ను అనౌన్స్ చేసింది. వివో V Series నుంచి ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసింది. వివో V40 నుంచి మూడు ఫోన్లు విడుదల చేసిన కంపెనీ ఇప్పుడు ఈ సిరీస్ నెక్స్ట్ జనరేషన్ ఫోన్ లను విడుదల చేస్తోంది. అప్ కమింగ్ సిరీస్ నుంచి వివో వి50 ఫోన్ ను విడుదల చేస్తున్న విషయాన్ని కంపెనీ అధికారిక X అకౌంట్ నుంచి కన్ఫర్మ్ చేసింది. ఈ అప్ కమింగ్ ఫోన్ గురించి ఆసక్తి రేకెత్తించేలా ఈ లాంచ్ టీజర్ పోస్ట్ ను రిలీజ్ చేసింది.
SurveyVivo V50 Launch
వివో అప్ కమింగ్ ఫోన్ వివో వి 50 లాంచ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే, ఈ ఫోన్ ఇదే లాంచ్ అవుతుందని రూమర్స్ ఉన్నాయి. అంతేకాదు, ఈ ఫోన్ అంచనా స్పెక్స్ కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, వాస్తవానికి 2024 నవంబర్ నెలలో చైనాలో విడుదల చేసిన వివో S20 స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో వి 50 ఫోన్ గా రీబ్రాండ్ చేసి అందించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Vivo V50 : అంచనా ఫీచర్స్
వివో వి50 స్మార్ట్ ఫోన్ 6.67 ఇంచ్ AMOLED స్క్రీన్ ను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ ను Snapdragon 7 Gen 3 చిప్ సెట్ తో అందించే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ స్క్రీన్ లో ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా వుండే అవకాశం ఉందట.

వివో ఈ అప్ కమింగ్ ఫోన్ టీజర్ ఇమేజ్ లో అందించిన క్యాప్షన్ ద్వారా ఈ ఫోన్ గొప్ప సెటప్ కలిగి ఉంటుందని అర్థం అవుతుంది. ఈ ప్రకారం, వివో వి50 ఫోన్ లో వేనుక 50MP డ్యూయల్ కెమెరా సెటప్ మరియు ముందు కూడా 50MP సెల్ఫీ కెమెరా కలిగి ఉండే అవకాశం ఉండవచ్చు.
Also Read: iQOO Neo 10R: సుందరమైన డిజైన్ మరియు పవర్ ఫుల్ ఫీచర్స్ తో వస్తోంది.!
ఇది కాకుండా, ఈ అప్ కమింగ్ వివో స్మార్ట్ ఫోన్ లో 6500 mAh భారీ బ్యాటరీ సెటప్ ను వేగవంతమైన 90W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో అందించవచ్చని ఊహిస్తున్నారు. అయితే, ఇవన్నీ కూడా రూమర్స్ మరియు అంచనా స్పెక్స్ గా మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. ఈ అప్ కమింగ్ ఫోన్ గురించి వివో ఇంకా ఎటువంటి వివరాలు వెల్లడించలేదు. కానీ, త్వరలోనే ఈ ఫోన్ లాంచ్ తో పాటు కీలకమైన ఫీచర్స్ వెల్లడించే అవకాశం వుంది.