ViVO V25 Pro స్మార్ట్ ఫోన్ 3D Curved డిస్ప్లే తో వస్తోంది.!
వివో ఇండియాలో కొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చెయ్యడానికి సిద్ధంగా వుంది
వివో చాలా కాలంగా టీజ్ చేస్తున్న ViVO V25 Pro
ఆగష్టు 17 న విడుదల చేస్తున్నట్లు ViVO ప్రకటించింది
వివో ఇండియాలో కొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చెయ్యడానికి సిద్ధంగా వుంది. వివో చాలా కాలంగా టీజ్ చేస్తున్న ViVO V25 Pro స్మార్ట్ ఫోన్ ను ఎట్టకేలకు ఆగష్టు 17 న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు, భారతదేశంలో V25 సిరీస్ నుండి V25, V25e మరియు V25 Pro లను కూడా విడుదల చేయడానికి సన్నద్ధమవుతోందని ప్రస్తుతం ఆన్లైన్లో చెక్కర్లు కొడుతున్న పుకార్ల ద్వారా తెలుస్తోంది. అయితే, ఇప్పటికి కేవలం ViVO V25 Pro లాంచ్ గురించి మాత్రమే కంపెనీ అధికారిక ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క రివీల్డ్ స్పెక్స్ మరియు ఈ ఫోన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు చూద్దాం.
SurveyVivo V25 Series: లాంచ్ డేట్ మరియు సమయం
Vivo V25 సిరీస్ ఆగస్టు 17న భారతదేశంలో మధ్యాహ్నం 12 గంటలకు (IST) లాంచ్ చేస్తుంది. అయితే, V25 ప్రోతో పాటు, Vivo స్టాండర్డ్ V25 మరియు V25e లను వచ్చే వారం లాంచ్ చేస్తుందని భావిస్తున్నారు.
ViVO V25 Pro: రివీల్డ్ స్పెక్స్
V25 Pro లో 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ వరకు సపోర్ట్ చేస్తుంది మరియు FHD+ రిజల్యూషన్ తో ఉంటుంది. వివో వి25 ప్రో స్మార్ట్ ఫోన్ వెనుక రంగు మార్చే బ్యాక్ ప్యానెల్ ను అందించింది. V23 సిరీస్‌లో చూసినట్లుగా ఫ్లోరైట్ AG గ్లాస్ ఉపయోగించడం వల్ల ఈ కలర్ చేంజ్ జరుగుతుంది. ఈ ఫోన్ సెయిలింగ్ బ్లూ కలర్‌తో రెండు కలర్ అప్షన్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
కెమెరా విభాగంలో, V25 ప్రో కూడా OIS సపోర్ట్ కలిగిన 64MP ట్రిపుల్ కెమెరా సెటప్ మరియు సూపర్ నైట్ పోర్ట్రెయిట్, వ్లాగ్ మూవీ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుందని నిర్ధారించబడింది. అంతేకాదు, OISకి సపోర్ట్ కలిగి 4K రిజల్యూషన్ లో షూట్ చేసే 32MP సెల్ఫీ కెమెరాని కూడా ఈ ఫోన్ లో ఉంటుందని ఉంటుందని భావిస్తున్నారు.
V25 Pro స్మార్ట్ ఫోన్ Dimensity 1300 చిప్‌సెట్ శక్తితో పనిచేస్తుంది మరియు మల్టీ RAM మరియు స్టోరేజ్ వేరియంట్ లతో జత చేయబడిందని Vivo ధృవీకరించింది. V25 ప్రోలో 4,830mAh బ్యాటరీ కూడా అమర్చబడింది, ఇది 66W ఫాస్ట్ ఛార్జింగ్ అవుట్-ఆఫ్-బాక్స్‌కు మద్దతు ఇస్తుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile