భారీ ఆఫర్లతో మొదలైన Vivo V23 Pro ప్రీ-బుకింగ్

భారీ ఆఫర్లతో మొదలైన Vivo V23 Pro ప్రీ-బుకింగ్
HIGHLIGHTS

Vivo V23 Pro ప్రీ-బుకింగ్ ను భారీ ఆఫర్లతో అందించింది

ఈ స్మార్ట్ ఫోన్ చాలా ప్రీమియం ఫీచర్లను కలిగి వుంది

రంగులు మార్చే బ్యాక్ గ్లాస్ ప్యానల్ వంటి యూనిక్ డిజైన్ తో వచ్చింది

భారీ ఫీచర్లతో వివో ఇండియాలో విడుదల చేసిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Vivo V23 Pro ప్రీ-బుకింగ్ ను భారీ ఆఫర్లతో అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ చాలా ప్రీమియం ఫీచర్లను కలిగి వుంది మరియు రంగులు మార్చే బ్యాక్ గ్లాస్ ప్యానల్ వంటి యూనిక్ డిజైన్ తో వచ్చింది. ఈ ఫోన్ ప్రీ ఆర్డర్ లను ఇప్పటికే మొదలు పెట్టింది మరియు ఈ ఫోన్ ను ప్రీ ఆర్డర్ చేసే వారికి  ఆఫర్లను అందుబాటులో ఉంచింది.

ఫ్లిప్ కార్ట్ నుండి ఈ ఫోన్ ప్రీ ఆర్డర్ చేసే వారికి మంచి ఆఫర్లు అందుబాటులో ఉంచింది. ఆఫర్ల విషయానికి వస్తే, HDFC బ్యాంక్ కార్డ్స్ మరియు EMI పైన Vivo V23 Pro ప్రీ బుక్ చేసుకునేవారికి 3,000 ఫ్లాట్ డిస్కౌంట్ అఫర్ చేస్తోంది. ఇది మాత్రమే కాదు, 70% బై బ్యాక్ పాలసీ, 9 నెలల No Cost EMI మరియు ఎక్స్ చేంజ్ పైన 2,000 రూపాయల వరకూ అధనపు ఎక్స్ చేంజ్ బోనస్ వంటి ఆఫర్లను ప్రకటించింది.

Vivo V23 Pro: ధర

వివో V23 ప్రో బేసిక్ వేరియంట్ 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో రూ.38,990 ప్రైస్ ట్యాగ్ తో వస్తుంది. అలాగే, వివో V23 ప్రో 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ వేరియంట్ రూ.43,990 ధరతో వస్తుంది.   

Vivo V23 Pro: స్పెక్స్

Vivo V23 Pro స్మార్ట్ ఫోన్ 6.56 ఇంచ్ AMOLED కర్వ్డ్ డిస్ప్లేని FHD+ రిజల్యూషన్ తో కలిగి వుంది. ఈ ఫోన్ MediaTek Dimensity 1200 చిప్‌సెట్ శక్తితో వస్తుంది. ఇది 8GB/12GB ర్యామ్ మరియు 128/256 GB స్టోరేజ్ ఎంపికలతో లభిస్తుంది. ఈ ఫోన్ మెటల్ బాడీ మరియు 3D కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది.

ఈ ఫోన్ లో 50MP Eye AF డ్యూయల్ సెల్ఫీ కెమెరాని అందించింది. వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇందులో,  108MP AF కెమెరా జతగా 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ మరియు 2MP మ్యాక్రో సెన్సార్ కలిగివుంది. ఈ ఫోన్ టైప్-C ఛార్జింగ్ పోర్ట్, 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ కలిగిన 4300mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo