ఇండియాలో విడుదలైన VIVO U20 : గేమింగ్ కోసం ప్రత్యేక మోడ్ తో వచ్చింది

ఇండియాలో విడుదలైన VIVO U20 : గేమింగ్ కోసం ప్రత్యేక మోడ్ తో వచ్చింది
HIGHLIGHTS

ఈ ఫోన్ను మొదటి సేల్ నుండి కొనేవారికి 1000 తగ్గింపు లభిస్తుంది.

ఇటీవల, ఇండియాలో గొప్ప ప్రత్యేకతలో వచ్చి మంచి అమ్మకాలను సాధించిన, VIVO U 10 యొక్క వారసుడిగా, ఈ రోజు ఇండియాలో VIVO U 20 స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్, స్నాప్ డ్రాగన్ 675 SoC తోపాటుగా ఒక పెద్ద 5000mAh బ్యాటరీ తో లాంచ్ చెయ్యబడింది. ఈ స్మార్ట్ ఫోన్ను కేవలం రూ .10,990 రూపాయల ప్రారంభ ధర వద్ద విడుదల చేసింది.

VIVO U10 :  ధర

వివో యు 20 యొక్క సాధారణ వేరియంట్ రూ .10,990 నుండి ప్రారంభమవుతుంది, ఇది 4 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్ తో ఉంటుంది. ఇది కాకుండా, రూ .11,990 ధరతో 6 జీబీ + 64 జీబీ వేరియంట్ ను తీసుకొచ్చారు. ఈ ఫోన్ యొక్క మొదటి సేల్ నవంబర్ 28 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి జరగనుంది. అయితే, ఫస్ట్ సేల్ ఆఫర్ క్రింద ఈ ఫోన్ను మొదటి సేల్ నుండి ముందస్తు చెల్లిపు చేసేవారికి, 1000 తగ్గింపు లభిస్తుంది. అధనంగా, రిలయన్స్ జియో బెనిఫిట్స్ క్రింద 6000 బెనిఫిట్స్ మరియు 6 నెలల EMI తో కొనేవారి కోసం NO Cost EMI ని ప్రకటించింది.          

VIVO U20 ప్రత్యేకతలు

ఈ వివో యు 20 ఒక పెద్ద 6.35-అంగుళాల FHD + ఐపిఎస్ డిస్ప్లే తో లాంచ్ చేయబడింది మరియు ఈ ఫోన్ బ్లేజ్ బ్లూ మరియు రేసింగ్ బ్లాక్ వంటి రెండు మంచి కలర్ రంగులలో అందించబడుతోంది. ఇవి కాకుండా, ఒక పెద్ద 5000 mAh బ్యాటరీ కూడా ఈ ఫోనులో అందించబడింది, ఇది 18w ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

ఈ స్మార్ట్‌ ఫోన్ ఒక క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 675AIE ప్రాసెసర్‌తో పనిచేస్తుంది మరియు గేమింగ్ పనితీరును మెరుగుపరచడానికి, ఈ ఫోన్ అల్ట్రా గేమ్ మోడ్‌ను కూడా కలిగి ఉంటుంది, అలాగే ఫోనులో డార్క్ మోడ్‌ ని కూడా అందించారు.ఈ ఫోన్, ఆండ్రాయిడ్ 9 పై ఆధారితంగా Funtouch OS 9.2 స్కిన్ పైన నడుస్తుంది.     

కెమెరా విభాగం గురించి మాట్లాడితే, ఈ ఫోన్ వెనుక భాగంలో AI ట్రిపుల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది, దీనిలో 16 MP ప్రాధమిక కెమెరా మరియు దానికి జతగా ఒక 8 మెగాపిక్సెల్స్ వైడ్ యాంగిల్ కెమెరా మరియు మూడవదిగా  2 MP  మాక్రో సెన్సార్ కూడా ఉన్నాయి. ఇక సెల్ఫీల కోసం ఈ ఫోన్ ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇవ్వబడింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo