VIVO U 20 స్పెక్స్ వివరిస్తున్న కొత్త టీజర్ : ట్రిపుల్ కెమేరా, 5000mAh మరియు మరెన్నో

HIGHLIGHTS

ఇది UFS 2.1 స్టోరేజిను కలిగి ఉంటుంది.

VIVO U 20 స్పెక్స్ వివరిస్తున్న కొత్త టీజర్ : ట్రిపుల్ కెమేరా, 5000mAh మరియు మరెన్నో

ఇండియాలో మంచి అమ్మకాలను సాధించి మరియు బడ్జెట్ స్మార్ట్ ఫోనుగా పేరుపొందిన  వివో U10 యొక్క వారసునిగా  VIVO U20 స్మార్ట్ ఫోన్నునవంబర్ 22 మధ్యాహ్నం 12 గంటలకు భారతదేశంలో విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది. ఈ ఫోన్ అమేజాన్ ప్రత్యేకంగా రానునట్లు చెప్పొచ్చు. ఎందుకంటే, అమెజాన్.ఇన్ లో దీని కోసం ఒక ప్రత్యేకమైన పేజీని కూడా ఇప్పటికే అందించింది మరియు ఇందులో ఈ ఫోనుకు సబంధించిన వీడియోతో కూడా టీజ్ చేస్తోంది.  ఈ వివో యు 20 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ మరియు ముందు భాగంలో వాటర్‌డ్రాప్ నోచ్‌ ను ప్యాక్ చేస్తుందని ఈ టీజర్ ఇమేజ్ వెల్లడించింది. ఇంకా, ఈ స్మార్ట్‌ ఫోన్ 6 జీబీ ర్యామ్‌ తో జతచేయబడిన ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 675 AIE చిప్‌సెట్ ద్వారా శక్తినివ్వనుంది. ఇది UFS 2.1 స్టోరేజిను కలిగి ఉంటుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

అమెజాన్ టీజర్ పేజీ, వివో యు 20 ముందు మరియు వెనుక వైపు చూపిస్తోంది. ఈ ఫోన్ గ్రేడియంట్ డిజైనులో కనిపిస్తుంది. వెనుకవైపు, LED ఫ్లాష్‌ తో వేలిముద్ర సెన్సార్ మరియు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను చూడవచ్చు, కాని సెన్సార్ల స్పెసిఫికేషనుకు సంబంధించి ఎటువంటి సమాచారం లేదు. ముందు వైపు, ఒక చిన్న నోచ్ మరియు దిగువ ఒక చిన్న చిన్ చూడవచ్చు.

టీజర్ పేజీ ప్రకారం, వివో యు 20 నవంబర్ 22 న భారతదేశంలో విడుదల కానుంది. ఇది అమెజాన్-ప్రత్యేకమైన డివైజుగా వచ్చే అవకాశం ఉంది. ఈ స్మార్ట్ ఫోనులో స్నాప్డ్రాగన్ 675 చిప్సెట్ గురించి టీజర్ మరింత ప్రస్తావించింది. దాని ముందున్న వివో యు 10 కి శక్తినిచ్చే స్నాప్‌డ్రాగన్ 665 SoC కంటే ఈ చిప్సెట్ 25 శాతం (AnTuTu బెంచ్‌మార్క్ స్కోరు పరంగా) పనితీరును పెంచుతుందని పేజీ పేర్కొంది.

వివో యు 20 6 జిబి ర్యామ్ వరకు అమర్చబడిందని చెప్పబడింది, అంటే ఇది అనేక ర్యామ్ వెర్షన్లలో రావచ్చు. ఈ ఫోనులో 6.3-అంగుళాల పూర్తి-హెచ్‌డి + (1080×2340 పిక్సెల్స్) డిస్ప్లే ఉండవచ్చు. ఇది 16MP + 8MP + 2MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇది 16MP సెల్ఫీ షూటర్‌తో రావచ్చు. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 9 పై ఆధారంగా ఫన్‌టచ్ ఓఎస్ 9.1 ను అమలు చేస్తుందని భావిస్తున్నారు. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ప్యాక్ చేయవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo