వివో U 20 అమేజాన్ నుండి ఓపెన్ సేల్ ద్వారా అమ్ముడవుతోంది

వివో U 20 అమేజాన్ నుండి ఓపెన్ సేల్ ద్వారా అమ్ముడవుతోంది
HIGHLIGHTS

ఇది 18w ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

ఇటీవల, గేమింగ్ మరియు కెమేరాల ఫీచర్లతో బడ్జెట్ ధరలో వివో సంస్థ తీసుకోచ్చినటువంటి, వివో U20 స్మార్ట్ ఫోన్ ఇప్పటి వరకూ ఫ్లాష్ సేల్ ద్వారా అమ్ముడవగా, ఇప్పుడు ఓపెన్ సేల్ ద్వారా అమ్ముడవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్, ముందుగా బడ్జెట్ ధరలో వచ్చినటువంటి U10 యొక్క తరువాతి తరం ఫోనుగా దీనిని, వివో మార్కెట్లోకి తీసుకువచ్చింది. 

VIVO U20 ప్రత్యేకతలు

ఈ వివో యు 20 ఒక పెద్ద 6.35-అంగుళాల FHD + ఐపిఎస్ డిస్ప్లే తో లాంచ్ చేయబడింది మరియు ఈ ఫోన్ బ్లేజ్ బ్లూ మరియు రేసింగ్ బ్లాక్ వంటి రెండు మంచి కలర్ రంగులలో అందించబడుతోంది. ఇవి కాకుండా, ఒక పెద్ద 5000 mAh బ్యాటరీ కూడా ఈ ఫోనులో అందించబడింది, ఇది 18w ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

ఈ స్మార్ట్‌ ఫోన్ ఒక క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 675AIE ప్రాసెసర్‌తో పనిచేస్తుంది మరియు గేమింగ్ పనితీరును మెరుగుపరచడానికి, ఈ ఫోన్ అల్ట్రా గేమ్ మోడ్‌ను కూడా కలిగి ఉంటుంది, అలాగే ఫోనులో డార్క్ మోడ్‌ ని కూడా అందించారు.ఈ ఫోన్, ఆండ్రాయిడ్ 9 పై ఆధారితంగా Funtouch OS 9.2 స్కిన్ పైన నడుస్తుంది. 

కెమెరా విభాగం గురించి మాట్లాడితే, ఈ ఫోన్ వెనుక భాగంలో AI ట్రిపుల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది, దీనిలో 16 MP ప్రాధమిక కెమెరా మరియు దానికి జతగా ఒక 8 మెగాపిక్సెల్స్ వైడ్ యాంగిల్ కెమెరా మరియు మూడవదిగా  2 MP  మాక్రో సెన్సార్ కూడా ఉన్నాయి. ఇక సెల్ఫీల కోసం ఈ ఫోన్ ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇవ్వబడింది.                                               

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo