వివో U10 vs రియల్మీ3 vs రియల్మీ5 : బడ్జెట్ ధరలో ఏది బెస్ట్ స్మార్ట్ ఫోన్

వివో U10 vs రియల్మీ3 vs రియల్మీ5 : బడ్జెట్ ధరలో ఏది బెస్ట్ స్మార్ట్ ఫోన్
HIGHLIGHTS

ఈ బడ్జెట్‌లో మీకు ఏ స్మార్ట్ ఫోన్ మంచిగా ఉంటుందో తెలుసుకోండి.

వివో సంస్థ తన U 10 ఫోన్ను ఒక ట్రిపుల్ రియర్ కెమెరా, 5000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీతో భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో విడుదల చేసింది. అంతేకాదు, ఈ  ఫోన్ ప్రారంభ ధర కూడా మీ బడ్జెట్‌లోనే ఉంటుంది.  మీరు దీన్ని రూ .10000 కంటే తక్కువ ధరలోనే కొనుగోలు చేయవచ్చు, ఈ మొబైల్ ఫోన్ యొక్క మొదటి సెల్ సెప్టెంబర్ 29 న జరగనుంది అయితే, మార్కెట్లో ఇలాంటి మొబైల్ ఫోన్లు చాలా ఉన్నాయి, వీటిని మీరు దాదాపు ఒకే రకమైన స్పెక్స్‌తో ఒకే ధరతో కొనేవీలుంది. అందుకోసమే, ఇప్పుడు వివో U 10 మరియు ఈ ఫోన్‌ల మధ్య తేడా ఏమిటి, అన్న విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. దీని కోసం, మేము వివో యు 10 స్మార్ట్‌ ఫోన్ను రియల్మీ 3 మరియు రియల్మీ 5 స్మార్ట్‌ ఫోన్లతో పోల్చబోతున్నాం మరియు ఈ బడ్జెట్‌లో మీకు ఏ స్మార్ట్ ఫోన్  మంచిగా ఉంటుందో తెలుసుకోండి.

ధర (Price)

వివో U10 ధర రూ .8,990 నుండి ప్రారంభమవుతుంది, ఇది 3 జిబి ర్యామ్ మరియు 32 జిబి స్టోరేజ్ వేరియంట కోసం ఇచ్చినది. ఇవి కాకుండా 3 జీబీ + 64 జీబీ వేరియంట్ ధర రూ .9,990 , 4 జీబీ + 64 జీబీ వేరియంట్ ధర రూ .10,990 గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ మొదటి అమ్మకం సెప్టెంబర్ 29 న అమెజాన్ ఇండియా మరియు వివో యొక్క ఆన్‌లైన్ స్టోర్‌లో ప్రారంభమవుతుంది. లాంచ్ ఆఫర్ కింద, ఈ ఫోన్ను SBI కార్డుతో కొనుగోలు చేస్తే 10% తక్షణ డిస్కౌంట్ అందుతుంది మరియు 6 నెలల వరకు ఖర్చు లేకుండా NO Cost EMI తో కొనుగోలు చేయవచ్చు.

రియల్మీ5 మొబైల్ ఫోన్ కూడా రెండు వేర్వేరు ర్యామ్ మరియు స్టోరేజ్ వేరియంట్‌లతో లాంచ్ చేయబడింది, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ మొబైల్ ఫోన్ కేవలం రూ .8,999, రూ .9,999 తో 3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ మరియు 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ . రూ.10,999 ధరలతో ఉంటుంది. ఇది కాకుండా, మేము రియల్మి 5 గురించి చూస్తే, దాని 3 జిబి ర్యామ్ + 32 జిబి స్టోరేజ్ వేరియంట్ రూ .9,999 వద్ద ప్రారంభించబడింది. డివైస్ యొక్క 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ .10,999 కు, 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ .11,999 కు ప్రవేశపెట్టారు.

ప్రత్యేకతలు ( Specs)

రియల్మి 3 మొబైల్ ఫోన్‌లో, ఒక మీడియా టెక్ హిలియో పి 70 ప్రాసెసర్‌తో పాటు 3 డి గ్రేడియంట్ యూనిబోడీ డిజైన్, డ్యూయల్ రియర్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు వాటర్‌డ్రాప్ నాచ్‌తో ఉంటుంది.  మొబైల్ ఫోన్‌లో మీకు ఒక 4,230 ఎంఏహెచ్ లభిస్తుంది.  ఇది కాకుండా, మొబైల్ ఫోన్ ఆండ్రాయిడ్ 9 పైన  పనిచేస్తుంది. ఇది కాకుండా, ఈ మొబైల్ ఫోన్ రెండు వేర్వేరు వేరియంట్లతో భారతదేశంలో లాంచ్ చేయబడింది. రియల్మీ2 తో పోల్చితే ఈ మొబైల్ ఫోన్‌ను కొత్త రూపంలో మరియు కొత్త స్పెక్స్‌తో లాంచ్ చేశారని సరళమైన మాటల్లో చెప్పవచ్చు.

అయితే,  వివో యు 10 మొబైల్ ఫోన్ విషయానికి వస్తే, వివో యు 10 ఒక 6.35 అంగుళాల HD + ఐపిఎస్ డిస్‌ప్లేతో లాంచ్ అయ్యింది. ఈ డివైస్ ఎలక్ట్రిక్ బ్లూ మరియు థండర్ బ్లాక్ వంటి రెండు రంగులలో అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇవి కాకుండా, 5000 mAh బ్యాటరీ ఈ ఫోన్‌లో అందించబడింది, ఇది 18w ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665AIE ప్రాసెసర్‌తో పనిచేస్తుంది మరియు గేమింగ్ పనితీరును మెరుగుపరచడానికి, ఈ ఫోన్ అల్ట్రా గేమ్ మోడ్‌ను కూడా కలిగి ఉంటుంది, అలాగే ఫోన్‌లో డార్క్ మోడ్‌ను కూడా అందించారు.

కెమెరా విభాగంలో, ఈ ఫోన్ వెనుక భాగంలో AI ట్రిపుల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది, దీనిలో 13MP ప్రాధమిక కెమెరా ఇవ్వబడింది మరియు రెండవ కెమెరా 8 మెగాపిక్సెల్స్ మరియు మూడవ 2 MP డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇవ్వబడింది.

ఇది కాకుండా, రియల్మి 5 యొక్క స్పెక్స్ గురించి చూస్తే, ఈ స్మార్ట్ ఫోన్  ఒక 6.5-అంగుళాల మినీ-డ్రాప్ పూర్తి స్క్రీన్ డిస్ప్లేని కలిగి ఉంది, ఇది 89% స్క్రీన్-టు-బాడీ నిష్పత్తిని కలిగి ఉంటుంది . ఈ స్మార్ట్‌ ఫోనుకు క్రిస్టల్ డిజైన్ ఇవ్వబడింది మరియు ఇది క్రిస్టల్ బ్లూ మరియు క్రిస్టల్ పర్పుల్ వంటి రెండు కలర్ వేరియంట్‌లలో ప్రవేశపెట్టారు.

రియల్మి 5 ప్రో మాదిరిగానే క్వాడ్ కెమెరా సెటప్ కూడా ఇందులో ఉంది. ఇది 240fps స్లో-మో వీడియో, 190 డిగ్రీల వ్యూ ను అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 12MP ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ లెన్స్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ మరియు స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది మరియు క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 665 తో ఫోన్ లాంచ్ చేయబడింది మరియు డివైస్ ట్రిపుల్ సిమ్ స్లాట్‌ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo