రేపు విడుదలకానున్న VIVO U 10 స్పెక్స్ అధికారికంగా వెల్లడించిన వివో సంస్థ

రేపు విడుదలకానున్న VIVO U 10 స్పెక్స్ అధికారికంగా వెల్లడించిన వివో సంస్థ
HIGHLIGHTS

ఈ మొబైల్ ఫోన్‌లో ఎటువంటి స్పెక్స్ అందుకోనున్నామో ముందుగానే తెలిసిపోయింది.

వివో తన కొత్త బడ్జెట్ సిరిస్ నుండి U 10 ను రేపు ఇండియాలో లాంచ్ చేయబోతోంది. ఈ మొబైల్ ఫోన్ లాంచ్ అవ్వడానికంటే ముందుగానే ఈ ఫోన్ యొక్క స్పెక్స్ ఇప్పుడు అధికారికంగా వెల్లడించిన వివో సంస్థ. ఈ మొబైల్ ఫోన్‌లో ఎటువంటి స్పెక్స్ అందుకోనున్నామో ముందుగానే తెలిసిపోయింది.

వివో ఇండియా నుండి దాని అధికారిక వెబ్‌సైట్‌లో ప్రోమో ద్వారా ఈ లీక్స్ విడుదలయ్యాయి. దీని ద్వారా, ఈ మొబైల్ ఫోన్‌లో ఒక క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్‌ ఈ ఫోను పొందబోతునట్లు సమాచారం, దీనికి తోడు మీకు ఈ ఫోన్‌లో 4 జీబీ ర్యామ్ కూడా లభిస్తుంది. అలాగే, మీరు ఈ ఫోన్‌లో ఒక 6.35-అంగుళాల HD + నోచ్ స్క్రీన్‌ను కూడా పొందుతారు.

అలాగే, వివో U10 కెమెరా గురించి కూడా సమాచారం వెలువడింది. 13MP + 8MP + 2MP లెన్స్ యొక్క కాంబోతో ఈ ఫోన్‌లో మీరు ట్రిపుల్ కెమెరా సెటప్ అందుకొనునట్లు చెప్పొచ్చు. ఇక ఫోన్ వెనుక భాగంలో ఒక వేలిముద్ర సెన్సార్‌ను కూడా ఇస్తోంది.

ఇది కాకుండా, ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ సామర్థ్యం గల పెద్ద బ్యాటరీ కూడా లభిస్తుంది, ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఉంటుంది. అయితే, ఇది మాత్రమే కాదు, మీరు ఫోన్‌లో అల్ట్రా-గేమ్ మోడ్‌ను కూడా అందుకుంటారు. అయితే, వివో U10 లో మీరు వాయిస్ ఛేంజర్ మరియు 4D వైబ్రేషన్ వంటి ఫీచర్లను కూడా అందుకోన్నారు.

వివో యు 10 స్మార్ట్‌ఫోన్‌ను ఎలెక్ట్రి బ్లూ, థండర్ బ్లాక్ రంగుల్లో లాంచ్ చేయవచ్చు, ఈ మొబైల్ ఫోన్ అమెజాన్ ఇండియా ద్వారా అమ్మబోతోంది. ఈ ఫోన్ ప్రారంభించిన తర్వాతే దాని ధర మరియు దాని లభ్యత గురించి మీకు సమాచారం లభిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo