VIVO U10 ఇప్పుడు కేవలం రూ.8,490 ధరతో అమ్ముడవుతోంది
ఈ స్మార్ట్ ఫోన్ను చాలా తక్కువ ధరకే సొంతం చేసుకునే అవకాశం ఈ సేల్ నుండి లభిస్తుంది.
వివో సంస్థ కేవలం బడ్జెట్ ధరలో వెనుక మూడు కెమేరాలు, స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్ మరియు ఒక పెద్ద 5000 mAh బ్యాటరీతో ఇండియాలో తీసుకొచ్చినటు వంటి వివో U10 స్మార్ట్ ఫోన్ పైన ఇప్పుడు డిస్కౌంట్ తో పాటుగా మంచి ఆఫర్లను కూడా అందిస్తుంది. విషయానికి వస్తే, అమేజాన్ ఇండియా తన ఆన్లైన్ ప్లాట్ఫారం పైన ప్రకటించిన VIVO కార్నివాల్ సేల్ నుండి ఈ వివో యొక్క అనేకమైన స్మార్ట్ ఫోన్ల పైన ఈ ఆఫర్లను అందిస్తోంది. అయితే, బడ్జెట్ వినియోగదారులను అమితంగా ఆకర్షించిన ఈ స్మార్ట్ ఫోన్ను చాలా తక్కువ ధరకే సొంతం చేసుకునే అవకాశం ఈ సేల్ నుండి లభిస్తుంది.
Surveyఈ ఫోన్ ఈ సేల్ నుండి కేవలం రూ.8,490 రుపాయల ధరకే లభిస్తుంది. అదనముగా, ICICI బ్యాంకు యొక్క క్రెడిట్ కార్డు EMI పైన 5% మరియు డెడిట్ కార్డు EMI పైన 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ ని కూడా అందుకోవచ్చు.
VIVO U10 ప్రత్యేకతలు
ఈ వివో యు 10 ఒక పెద్ద 6.35-అంగుళాల HD + ఐపిఎస్ డిస్‌ప్లేతో లాంచ్ చేయబడింది మరియు ఈ ఫోన్ ఎలక్ట్రిక్ బ్లూ మరియు థండర్ బ్లాక్ వంటి రెండు మంచి కలర్ రంగులలో అందించబడుతోంది. ఇవి కాకుండా, ఒక పెద్ద 5000 mAh బ్యాటరీ కూడా ఈ ఫోనులో అందించబడింది, ఇది 18w ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.
ఈ స్మార్ట్ ఫోన్ ఒక క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665AIE ప్రాసెసర్‌తో పనిచేస్తుంది మరియు గేమింగ్ పనితీరును మెరుగుపరచడానికి, ఈ ఫోన్ అల్ట్రా గేమ్ మోడ్‌ను కూడా కలిగి ఉంటుంది, అలాగే ఫోనులో డార్క్ మోడ్ ని కూడా అందించారు.
కెమెరా విభాగం గురించి మాట్లాడితే, ఈ ఫోన్ వెనుక భాగంలో AI ట్రిపుల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది, దీనిలో 13 MP ప్రాధమిక కెమెరా మరియు దానికి జతగా ఒక 8 మెగాపిక్సెల్స్ వైడ్ యాంగిల్ కెమెరా మరియు మూడవదిగా 2 MP డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. ఇక సెల్ఫీల కోసం ఈ ఫోన్ ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇవ్వబడింది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile