vivo T5x 5G new Fusion red variant sale started from today
vivo T5x 5G న్యూ కలర్ వేరియంట్ సేల్ ఈరోజు నుంచి స్టార్ట్ అయ్యింది. ధరలో ఆకట్టుకునే డిజైన్ మరియు ఫీచర్స్ తో వివో టి5x స్మార్ట్ ఫోన్ ను 2026 మార్చి నెలలో వివో లాంచ్ చేసింది. ఈ ఫోన్ మార్కెట్లో మంచి అమ్మకాలు కూడా సాధించింది. ఈ ఫోన్ యొక్క కొత్త ఫ్యూజన్ రెడ్ కలర్ వేరియంట్ ను వివో కొత్తగా లాంచ్ చేసింది మరియు ఈ ఫోన్ ఈరోజు నుంచి సేల్ కి అందుబాటులోకి కూడా వచ్చింది.
ఈ కొత్త వేరియంట్ ను కూడా రూ. 27,999 ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఇది బేసిక్ 8GB + 128GB వేరియంట్ ప్రైస్ మరియు 8GB + 256GB వేరియంట్ రూ. 30,999 ధరలో వచ్చింది. ఈ ఫోన్ ఈరోజు నుంచి ఫ్లిప్ కార్ట్ మరియు వివో అఫీషియల్ సైట్ నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చింది.
ఈ ఫోన్ పై భారీ ఆఫర్లు కూడా వివో అందించింది. ఈ ఫోన్ పై రూ. 2,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. HDFC, AXIS మరియు SBI క్రెడిట్ కార్డ్ తో ఈ ఫోన్ తీసుకునే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. అయితే, Flipkart Axis క్రెడిట్ కార్డ్ తో ఈ ఫోన్ తీసుకుంటే మాత్రం ఏకంగా రూ. 3,300 భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ కేవలం 25 వేల రూపాయల బడ్జెట్ లో లభిస్తుంది.
Also Read : Apple Services Down: యాపిల్ యూజర్లకు షాకింగ్ న్యూస్ .. మీ ఫోన్ ఒకసారి చెక్ చేసుకోండి.!
ఈ కొత్త వేరియంట్ కూడా అదే పాత వేరియంట్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. కేవలం కలర్ మాత్రమే కొత్త ఫ్యూజన్ రెడ్ కలర్ లో ఉంటుంది. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ 10 లక్షల కంటే అధిక AnTuTu స్కోర్ అందించే మీడియాటెక్ Dimensity 7400 Turbo ప్రాసెసర్ తో పని చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 8 జీబీ ర్యామ్ జతగా 128 / 256 GB స్టోరేజ్ ఆప్షన్ తో వస్తుంది. ఈ ఫోన్ లేటెస్ట్ ఆరిజిన్ సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టం తో వస్తుంది. ఈ ఫోన్ మిలటరీ గ్రేడ్ డ్యూరాబిలిటీ కూడా కలిగి ఉంటుంది.
కెమెరా పరంగా, ఈ వివో ఫోన్ 50MP + 2MP డ్యూయల్ రియర్ మరియు ముందు 32MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్ మరియు లేటెస్ట్ ఏఐ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ 7200 mAh బిగ్ బ్యాటరీ మరియు 44W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ వివో లేటెస్ట్ ఫోన్ IP68 మరియు IP69+ సర్టిఫికేషన్ తో గొప్ప డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కూడా కలిగి ఉంటుంది.